మెగాస్టార్ మెగామూవీ సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు స్టయిలిష్ స్టార్ బన్నీ హాజరుకాలేదన్నది తెలిసిన సంగతే. అయితే ఎందుకు హాజరుకాలేదన్నది మాత్రం తెలియదు. బన్నీ మనసులో ఏముంది? కేవలం అల వైకుంఠపురములో క్లయిమాక్స్ షూటింగ్ అనే రాలేదా? మరే మన్నానా? అన్నది తెలియదు.
కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ వ్యవహారం వెనుక సంగతి ఇలావుందని తెలుస్తోంది. ముందుగా 18న ఫంక్షన్ జరుగుతుందని ప్రకటించినపుడు యూనిట్ వైపు నుంచి ఓ డిజైన్ కార్డ్ బయటకు వచ్చింది. రాజమౌళి, పవర్ స్టార్, కేటీఆర్ ల పేర్లు బయటకు వచ్చాయి. అంతలో కేటీఆర్ రావడం లేదని క్లారిటీ వచ్చింది. రాజమౌళి, పవర్ స్టార్, చిరంజీవిల తో డిజైన్ కార్డ్ వచ్చింది.
ఎక్కడా బన్నీ ప్రస్తావన లేదు. ఫోటో లేదు పేరు లేదు. కనీసం బన్నీ కూడా హాజరవుతారని ప్రకటనలేదు. దాంతో బన్నీ హర్ట్ అయినట్లు బోగట్టా. మెగా హీరోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత రామ్ చరణ్, బన్నీ ఓ రేంజ్ అనుకుంటే వరుణ్ తేజ్ మరో రేంజ్ అనుకోవాలి. బన్నీ ఓ దశలో పవన్ కళ్యాణ్ రేంజ్ కు వెళ్తున్నట్లు కనిపించాడు.
ఇలాంటి నేపథ్యంలో తను వస్తున్నట్లు కానీ, వస్తానని కానీ ప్రకటించకుండా, రమ్మనిమాట మాత్రానికైనా నిర్మాత హోదాలో రామ్ చరణ్ చెప్పకుండా వుంటే తను ఎందుకు వెళ్లాలని బన్నీ ఫీలయినట్లు తెలుస్తోంది. అందుకే ట్రయిలర్ ను ట్వీట్ చేయకుండా, పంక్షన్ కు హాజరుకాకుండా వుండిపోయినట్లు గీతా క్యాంప్ కు సన్నిహితంగా వుండే జనాల ద్వారా తెలుస్తోంది.