Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బన్నీ-సుకుమార్ టైటిల్ 'పుష్ప'?

బన్నీ-సుకుమార్ టైటిల్ 'పుష్ప'?

టాలీవుడ్ లో ప్లానింగ్ లో వున్న ఎగ్జయిటింగ్ ప్రాజెక్టుల్లో బన్నీ-సుకుమార్ - మైత్రీ ప్రాజెక్టు ఒకటి. అన్నీ సజావుగా వుండి, కరోనా వ్యవహారం లేకుండా వుండి వుంటే, ఈపాటికి ఓ షెడ్యూలు అయిపోయి వుండేది. బన్నీ బర్త్ డే (బుధవారం) నాటికి చిన్న టీజర్ నో, మరోటో వచ్చి వుండేది. కానీ ఇప్పుడు కేవలం టైటిల్ అనౌన్స్ మెంట్ ఇంకా బన్నీకి చేసిన ఫొటో షూట్ నుంచి ఫస్ట్ లుక్ రాబోతోంది.

ఈ సినిమాకు మొదటి నుంచి శేషాచలం అనే టైటిల్ వినిపించింది. అయితే అది కాదని కూడా అంతే రేంజ్ లో వినిపించింది. లేటెస్ట్ గా తెలిసిన సంగతి ఏమిటంటే ఈ సినిమాకు సుకుమార్ టైటిల్ ను హీరోయిన్ మీద ఫిక్స్ చేస్తున్నారని. సినిమాలో హీరోయిన్ పేరు పుష్ప. ఇప్పుడు సినిమాకు పెడుతున్న టైటిల్ అదే.

పుష్ప అనే టైటిల్ అనౌన్స్ అయితే మాత్రం బన్నీ ఫ్యాన్స్ కాస్త సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఎందుకుంటే ఓ టాప్ హీరో ఓ టాప్ డైరక్టర్ కలిసి చేసే సినిమాకు పుష్ప అనే టైటిల్ అనేసరికి ఆశ్చర్యమే. అయితే రామ్ చరణ్ సినిమాకు రంగస్థలం అన్నప్పడు ఇలాగే కాస్త ఆశ్చర్యపోయిన వారు వున్నారు.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం బన్నీ-సుకుమార్ సినిమా టైటిల్ పుష్ప అనే తెలుస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో బన్నీని వైవిధ్యమైన పాత్రలో చూపిస్తూ, పుష్ప అనే టైటిల్ ను పెడుతున్నారు అంటే కచ్చితంగా ఈ ప్రాజెక్టు ఆసక్తికరమే. సందేహం లేదు. సుకుమార్ మళ్లీ మరో రంగస్థలం లెవెల్ సినిమా చూపించబోతున్నారు.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?