నిర్మాత బన్నీవాస్-దర్శకుడు మారుతి-హీరో సాయితేజ్ ల ప్రతిరోజూ పండగే సినిమా విడుదలయింది. సినిమాకు మిక్స్ డ్ సమీక్షలు వచ్చాయి. తొలి రెండు రోజులు కలెక్షన్ల ఫరవాలేదు అనిపించుకున్నాయి. ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమా మాత్రం నిర్మాత బన్నీవాస్-యువి వంశీలకు మాత్రం పండగే అని తెలుస్తోంది. ఎలా అంటే..
సినిమా నిర్మాణానికి అన్నీ కలిపి పాతిక కోట్ల వరకు అయింది. ఇందులో దర్శకుడు మారుతి రెమ్యూనిరేషన్ ఆరుకోట్లు కీలకం. ఆపైన హీరో రెమ్యూనిరేషన్. ఇంకా..ఇంకా. ఇదిలా వుంటే సినిమా శాటిలైట్, డిజిటల్, హిందీ అన్నీ కలిపి 16 కోట్లు రాబట్టేసారు.
ఇది కాక ఓవర్ సీస్, కర్ణాటక, విశాఖ, సీడెడ్, నెల్లూరు కలిపి ఏడు కోట్ల వరకు అమ్మేసారు. అడియో రైట్స్ మీద 70 లక్షల వరకు వచ్చింది. అంటే దాదాపు వీటితోనే దగ్గర దగ్గర సేఫ్ అయిపోయారు. నిర్మాతలకు ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, కీలకమైన నైజాం మిగిలాయి.
ఈ ఏరియాలే అన్నీ కలిపి హీనంలో హీనం 10 కోట్లకుపై పైగా వస్తాయని అంచనా వేస్తున్నారు. సాయితేజ్ సినిమా మీద ఈ మేరకు లాభాలు తెచ్చుకున్న సినిమా ఇదే అనుకోవాలి. లాభాల్లో యువి వంశీ, గీతా బన్నీవాస్, అల్లు అరవింద్ లకు వాటాలు వున్నాయి.
అన్నీ బాగానే వున్నాయి కానీ, దర్శకుడు మారుతి తన స్వంతానికి ఓవర్ సీస్ హక్కుల్లో వాటా కొనుకున్నారు. అక్కడ మాత్రం ఆయనకు కాస్త నష్టం తప్పకపోవచ్చు.