బన్నీ వాసు వైఖరిపై మహేష్ గుస్సా

సినిమా రంగంలో హీరోలతో చాలా సమస్యగా వుంటుంది. వీసంలో వీగిపోతారు. చాలా స్మూత్ గా డీల్ చేయాలి. తను కూడా అలాంటి ఓ హీరో దగ్గర వుంటూ, హీరోల వ్యవహారాలు చూస్తూ కూడా నిర్మాత…

సినిమా రంగంలో హీరోలతో చాలా సమస్యగా వుంటుంది. వీసంలో వీగిపోతారు. చాలా స్మూత్ గా డీల్ చేయాలి. తను కూడా అలాంటి ఓ హీరో దగ్గర వుంటూ, హీరోల వ్యవహారాలు చూస్తూ కూడా నిర్మాత బన్నీ వాస్ వ్యవహరిస్తున్న తీరుపై సూపర్ స్టార్ మహేష్ బాబు కాస్త ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాల విడుదల వ్యవహారమే. వాస్తవానికి ఈ విషయంలో మొదట నా పేరు సూర్య నిర్మాతలు సరిగ్గానే వ్యవహరించారు. కూర్చుని మాట్లాడుకుందాం అనే ధోరణిలోనే వెళ్లారు.

అయితే ఓ పక్క ఇలా అంటూ, మరోపక్క సడెన్ గా డేట్ లు ప్రకటించడం అన్నది మహేష్ బాబుకు నచ్చలేదని తెలుస్తోంది. బన్నీ వాస్ కవ్వింపు ధోరణిలో వెళ్తున్నారని మహేష్ ఫీలయ్యారని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అలాంటపుడు మనమెందుకు వెనక్కుతగ్గాలి, డేట్ వేసేయండి అని మహేష్ నే చెప్పి, అనౌన్స్ చేయించారని తెలుస్తోంది.

ఈ పరిణామం బన్నీ వాస్ క్యాంప్ ఊహించలేదు. దాంతో సాయంత్రానికి మళ్లీ చర్చలు అన్న వ్యవహారానికి తెరతీసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కానీ మహేష్ ఇప్పుడు పక్కాగా ఫిక్సయిపోయారట. అనుకున్న డేట్ కు సినిమా వేసితీరాలనే చెప్పారని తెలుస్తోంది. ఇఫ్పుడు ఇక బన్నీ వాస్ క్యాంప్ ముందువున్న ఆప్షన్ ఒకటే.. మాటకు కట్టుబడి పోటీకి సిద్దంకావడం. లేదూ అంటే బన్నీ వాస్ అత్యుత్సాహం వల్ల బన్నీ పరువుకు సమస్య అవుతుంది.