ఫస్ట్ షెడ్యూల్ అవుట్ పుట్ పై చిరంజీవి పెద్దగా సంతృప్తి వ్యక్తం చేయలేదట. అమితాబ్ బచ్చన్ కూడా తప్పుకునే ఆలోచనలో ఉన్నారట. ఏఆర్ రెహ్మాన్ తప్పుకున్న తర్వాత సైరాకు మరో మ్యూజిక్ డైరక్టర్ దొరకడం లేదట. ఇలా ఎన్నో పుకార్ల మధ్య సెకెండ్ షెడ్యూల్ కు రెడీ అవుతోంది చిరంజీవి151వ సినిమా.
ఈనెల 23 నుంచి సైరా నరసింహారెడ్డి రెండో షెడ్యూల్ ప్రారంభించాలని నిర్ణయించారు. అందరూ ఊహించినట్టు కేరళలోనో, రాజస్థాన్ లోనో కాకుండా.. సెకెండ్ షెడ్యూల్ ను కూడా హైదరాబాద్ లోనే చేయాలని ఫిక్స్ అయ్యారు. సురేందర్ రెడ్డి ఈ సినిమాకు డైరక్టర్.
సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైతే సినిమాకు సంబంధించి కొన్ని విషయాలపై క్లారిటీ వస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో నయనతార నటిస్తుందా లేదా అనే విషయం తేలిపోతుంది. నయనతార కాల్షీట్లు కేటాయిస్తే కనుక సెకెండ్ షెడ్యూల్ నుంచి హాజరవ్వాలి. ఇక సంగీత దర్శకుడు ఎవరనే విషయంపై కూడా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సెకెండ్ షెడ్యూల్ జరుగుతున్న టైమ్ కే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభించాలి.
సైరా సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా రాబోతున్న ఈ సినిమా.. ఈ ఏడాది విడుదలయ్యే అవకాశంలేదు.