మహేష్.. బన్నీ ఢీ అంటే ఢీ

మొత్తానికి ఫ్యాన్స్ మధ్యనే వుండే యుద్ధం సినిమా యూనిట్ ల మధ్యకు చేరినట్లు వుంది. బన్నీ క్యాంప్ జనాలు ఇప్పుడు మహేష్ సినిమా క్యాంప్ జనాలంటే మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఆగస్టులో తాము డేట్…

మొత్తానికి ఫ్యాన్స్ మధ్యనే వుండే యుద్ధం సినిమా యూనిట్ ల మధ్యకు చేరినట్లు వుంది. బన్నీ క్యాంప్ జనాలు ఇప్పుడు మహేష్ సినిమా క్యాంప్ జనాలంటే మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడో ఆగస్టులో తాము డేట్ ప్రకటించి, సినిమా చేసుకుని, పద్దతి ప్రకారం వస్తుంటే, మధ్యలో చేరింది కాక, తాము ఏ డేట్ అంటే ఆ డేట్ నే వాళ్ల సినిమాకు కూడా ప్రకటిస్తూ రావడం ఏమిటి? అని గుస్సాయిస్తున్నారు. ఇదంతా మహేష్ బాబుకు తెలియకుండా జరుగుతుందా? అని అంటున్నారు.

బన్నీ సినిమా మహేష్ సినిమా పోటీపడడం వల్ల ఇద్దరికి నష్టాలు వున్నాయి. అయితే మహేష్ కు కాస్త ఎక్కువ నష్టాలు వుంటాయి. ఇది వాస్తవం. ఎందుకంటే.. బన్నీ సినిమా బడ్జెట్ కంటే మహేష్ సినిమా బడ్జెట్ ఎక్కువ. అందువల్ల అమ్మకాల రేట్లు కూడా ఆ రేంజ్ లోనే వుంటాయి. బన్నీ కన్నా మహేష్ బాబుకు హిట్ చాలా అవసరం. బన్నీ సినిమా కలెక్షన్ల లెక్కల మీద అనుమానాలు వుంటే వుండొచ్చు కానీ, అపజయాలైతే కాదు.

మహేష్ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నాడు. ఇలాంటి టైమ్ లో సోలోగా రావడం బెటర్. కానీ అలాకాకుండా ఇలా చేయడం కాస్త ఇబ్బంది పడడమే. రెండు సినిమాలకు థియేటర్లు ఇవ్వాల్సిన వాళ్లు కామన్ గా వున్నారు. దిల్ రాజుకు అరవింద్ తో బంధాలు వున్నాయి. మహేష్ తో సినిమా వుంది. సీడెడ్ లో ఎన్వీప్రసాద్ కు సేమ్ టు సేమ్. నైజాంలో మాత్రమే కాస్త అడ్వాంటేజ్ వుంటుంది మహేష్ బాబుకు.

బన్నీ సిన్మాలు ఫ్లాప్ అయినా యాభైశాతానికి పైగా షేర్ వసూలు చేయగలవని బిజినెస్ సర్కిళ్లలో ఓ ధీమా వుంది. కానీ మహేష్ బాబు సినిమాలపై బయ్యర్ల సర్కిల్ లో ఆ ధీమాలేదు. మొత్తంమీద ఇలా చేయడం వల్ల ఇద్దరు హీరోల సినిమాలు ఓపెనింగ్స్ ను పంచుకోవడం అవుతుంది తప్ప ప్రయోజనం వుండదు. కానీ మహేష్ సినిమాకు కాస్త ఎక్కువ ఇబ్బంది. ఏమైనా ముడి బిగుసుకుపోయింది. ఇద్దరి సినిమాలు డేట్లు ప్రకటించారు. కూర్చుని చర్చించుకుని ఎవరు వెనక్కు జరిగినా కష్టమే. జరిగితే ముందుకే జరగాలి. 

మహేష్ సినిమా ముందుకు రావడం అసాధ్యం. ఎందుకంటే ఆ సినిమాకు ఇంకా చాలా వర్క్ వుంది. అయితే గియితే ఆ చాన్స్ బన్నీ సినిమాకే వుంది. మరి బన్నీ ముందుకు వస్తారా? లేక ఇలాగే భీష్మించుకుని ఇద్దరూ ఒకే రోజు వస్తారా? వేచి చూడాల్సిందే.