ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంగీతం అందించే బాధ్యత ఎస్ఎస్ థమన్ కు దక్కిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ డెసిషన్ కు దగ్గరగా త్రివిక్రమ్, హారిక హాసిని జనాలు రావడానికి వెనుక చాలా తతంగం నడిచిందని తెలుస్తోంది. అ..ఆ సినిమా టైమ్ లో అనిరుధ్ ను మ్యూజిక్ డైరక్షన్ కు ఓకె చేసారు. అడ్వాన్స్ ఇచ్చారు. కానీ అప్పట్లో అనిరుధ్ కు కుదరలేదు. విక్కీ జే మేయర్ తో ముందుకు వెళ్లారు. అయితే అజ్ఞాతవాసి టైమ్ లో అనిరుధ్ మళ్లీ లైన్లోకి వచ్చాడు.
కానీ అక్కడే చిన్న తకరారు వచ్చినట్లు వినికిడి. రెమ్యూనిరేషన్ దగ్గర కాస్త బేరాలు సాగాయి. ఆఖరికి పవన్ సినిమాకు పాతరేటు ప్రకారం, ఎన్టీఆర్ సినిమాకు కొత్తరేటు ప్రకారం ఇవ్వడానికి ఓకె అయ్యారు. తీరా అజ్ఞాతవాసి అడియో పెద్దగా విజయం సాధించకపోవడంతో, ఎన్టీఆర్ సినిమాకు పాత రేటుకే చేయమని అనిరుధ్ ను కోరినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎన్టీఆర్ సన్నిహితులు కూడా అనిరుధ్ పై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.
దాంతో త్రివిక్రమ్ అనిరుధ్ కు బై చెప్పి, ఆల్టర్ నేటివ్ కోసం చూసారట. ఎన్టీఆర్ ఓటు దేవీశ్రీ ప్రసాద్ కే. కానీ త్రివిక్రమ్ కు, దేవీ మధ్యలో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వుంది. దాంతో థమన్ పేరు లైన్ లోకి వచ్చింది. ఎన్టీఆర్ ముందు థమన్ పేరు పెడితే, ఓకె అనేసినట్లు తెలుస్తోంది. ఆ తరువాత థమన్ తో బేరాలకు దిగారు., బేరం కుదిరినట్లే వుంది. ఎందుకంటే థమన్ ఏమీ కోట్లకు కోట్లు తీసుకోడు దేవీశ్రీ రేంజ్ లో. ప్రస్తుతం హారిక వాళ్లకు కూడా అదేకావాలి. పైగా త్రివిక్రమ్ తో కలిసి పనిచేయడం థమన్ కు కావాలి. అందువల్ల బేరం కుదరడం సులువే కదా?