Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాక్ష్యం హిందీ హక్కులకు 8 కోట్లు

సాక్ష్యం హిందీ హక్కులకు 8 కోట్లు

ఈ మధ్య హిందీ డబ్బింగ్, ఇంకా డిజిటల్ రైట్స్ కు రేట్లు భయంకరంగా పెరిగాయి. తెలుగు సినిమాల్లో ముఖ్యంగా యాక్షన్ జోనర్ సినిమాలకు హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ బాగా పలుకుతున్నాయి. లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సాక్ష్యం సినిమా రైట్స్ 8కోట్లకు అమ్ముడుపోయాయి. గతంలో ఇదే హీరో డైరక్టర్ బోయపాటితో చేసిన సినిమాకు 7.5 కోట్లు పలికాయి. ఈ సినిమాకు మరో యాభై లక్షలు ఎక్కువే. సాక్ష్యం సినిమాకు దర్శకుడు శ్రీవాస్.

సాక్ష్యం సినిమాలో అయిదు భారీ ఫైట్లు వుంటాయి. పీటర్ హెయిన్స్ లాంటి ఫైట్ మాస్టర్ వీటిని డిజైన్ చేసారు. అలాగే జయజానకీ నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ చేసిన ఫైట్లు అలరించాయి. అందువల్ల సహజంగానే హిందీ డబ్బింగ్ కు మంచి గిరాకీ వచ్చింది. కోటి రూపాయల అడ్వాన్స్ తో అగ్రిమెంట్ అయిపోయింది. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెల్లంకొండ సరసన పూజహెగ్డే నటిస్తున్న ఈసినిమాలో శరత్ కుమార్, మీనా ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?