బన్నీ.. అసలేం జరిగింది?

వార్త వివరాలు తెలిసి అయినా వుండాలి లేదా తెలుసుకునే ప్రయత్నం అన్నా చేయాలి. అలాకాకుండా, ఏదో ఒకటి రాయాలి కదా? అని తోచింది రాసేస్తే అంత బాగోదు. త్రివిక్రమ్ కో డైరక్టర్ కు, బన్నీకి…

వార్త వివరాలు తెలిసి అయినా వుండాలి లేదా తెలుసుకునే ప్రయత్నం అన్నా చేయాలి. అలాకాకుండా, ఏదో ఒకటి రాయాలి కదా? అని తోచింది రాసేస్తే అంత బాగోదు. త్రివిక్రమ్ కో డైరక్టర్ కు, బన్నీకి మధ్య చిన్న వివాదం జరిగిన విషయాన్ని ఈ ఉదయాన్నే గ్రేట్ ఆంధ్ర బ్రేక్ చేసింది. అయితే ఇలా బ్రేక్ చేయగానే, వేరే మాధ్యమాల్లో, అయ్యో, మిస్ అయ్యామే అని, అది కవర్ చేసుకోవడానికి చిలవలు, పలవలు జోడించి, కథనాలు వండి వార్చేసారు. కానీ జరిగింది వేరు.

ఈనెల 15 నుంచి 17 మధ్యలో రాజేంద్రప్రసాద్ డేట్ లు దొరకలేదు. దాంతో త్రివిక్రమ్-బన్నీ షూట్ కు గ్యాప్ వచ్చింది. కానీ అది ముందుగా తెలియదు. వాస్తవానికి బన్నీ ఇదే మూడు రోజుల్లో అమెరికా వెళ్దామని అనుకున్నాడు. ఎందుకంటే, అక్కడ రానాకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ జరగబోతోంది. తన స్నేహితుడి కోసం వెళ్లాలి అనుకున్నాడు, కానీ షూట్ వుందని ఆగిపోయాడు.

కానీ తీరా లాస్ట్ మినిట్ లో షూట్ లేదని తెలిసింది. అదిగో అక్కడ వచ్చింది సమస్య. ముందుగా చెప్పడం, చెప్పుకోవడం తెలియదా అంటూ బన్నీ కో డైరక్టర్ ను ఓ లెక్కలో వేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కోపం డైరక్టర్ త్రివిక్రమ్ మీద వుండాలి. చూపించాలి. కానీ అది సాధ్యంకాదు కదా? అందుకే ఇలా కో డైరక్టర్ మీదకు డైవర్ట్ అయింది.

దీంతో అర్జెంట్ గా అల్లు అరవింద్ రంగప్రవేశం చేసారు. ఆయన తన సీనియార్టీ, మాట మంచితనం అన్నీ ఉపయోగించి సమస్య రచ్చకు ఎక్కకుండా, అసోసియేషన్ వరకు వెళ్లకుండా చూసారు. అన్నీ కామప్ చేసామనుకున్నారు. కానీ గ్రేట్ ఆంధ్ర వెల్లడించడంతో బయటకు వచ్చింది. జరిగింది ఇదీ.

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా