బావ రానా కోసం చైతన్య

బంధాలు అనుబందాలకు పేద గొప్ప తేడా వుండదు. డబ్బున్న వారి మధ్య కూడా భావోద్వేగాలు, అనుబంధాలు గట్టిగానే వుంటాయి. హీరో రానా కిడ్నీల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు మందుల మీద నెట్టుకువచ్చాడు.…

బంధాలు అనుబందాలకు పేద గొప్ప తేడా వుండదు. డబ్బున్న వారి మధ్య కూడా భావోద్వేగాలు, అనుబంధాలు గట్టిగానే వుంటాయి. హీరో రానా కిడ్నీల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు మందుల మీద నెట్టుకువచ్చాడు. అయితే కిడ్నీల మార్పిడి తప్పనిసరి. అందుకే ఇప్పుడు అమెరికా వెళ్లారు. అక్కడ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారు. దగ్గుబాటి కుటుంబసభ్యులంతా అమెరికా వెళ్లారు.

అయితే విషయం ఏమిటంటే, రానాకు కిడ్నీ ఇవ్వడం కోసం ఇటు తల్లి, అటు అత్త (చైతన్య మదర్) ముందుకు వచ్చారు. కోడుకు కోసం తల్లి, తమ్ముడి కోసం అక్క తమ తమ ఆరోగ్యాలను ఖాతరు చేయకుండా కిడ్నీలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

మరో విషయం ఏమిటంటే హీరో నాగచైతన్యకు కూడా రానా బంధువే అన్న సంగతి తెలిసిందే. స్వంత బావ. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరి మధ్య మాంచి బంధం వుంది. అందుకే నాగచైతన్య కూడా రానాకు కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడట. అయితే ఇంత చిన్న వయసులో మంచిది కాదని తండ్రి నాగ్ వారించినట్లు తెలుస్తోంది.

అయితే కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రావడం వరకు ఓకె. కానీ ఎవరి కిడ్నీ మ్యాచ్ అవుతుంది. ఎవరి ఆరోగ్యం సింగిల్ కిడ్నీకి సహకరిస్తుందన్నది చూసి డాక్టర్లు డిసైడ్ చేస్తారు. అందుకే రానా తల్లి, అత్త ఇద్దరూ కూడా అమెరికా వెళ్లారు. 

పూరి ఇంటర్వ్యూలో చెప్పినట్లే సినిమా ఉందా?

అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఇలా