ఆ మధ్య కాస్ట్ లీ కేరవాన్ తో వార్తల్లో కొంత కాలం హల్ చల్ చేసాడు స్టయిలిష్ స్టార్ బన్నీ. ఇప్పుడు మళ్లీ మరోసారి వార్తల్లోకి వస్తున్నాడు. ఈసారి బన్నీ కొనుగోలు చేసింది మూడు కోట్ల ఖరీదైన కారు. రేంజ్ రోవర్ ఓగ్ అనే ఈ కారు ను శుక్రవారం డెలివరీ తీసుకున్నాడు బన్నీ. బన్నీ దగ్గర ఇప్పటికే రెండు, మూడు ఖరీదైన కార్లు వున్నాయి. వాటి సరసన ఈ రేంజ్ రోవర్ ఓగ్ కూడా చేరింది. ప్రస్తుతం బన్నీ సినిమాకు పాతిక కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు.
లేటెస్ట్ గా బన్నీ మూడు సినిమాలు చేతిలో వుంచుకున్నాడు. అంటే దగ్గర దగ్గర 75 కోట్ల ఆదాయం. అందువల్ల మూడు కోట్ల కారు కొనడం పెద్ద కష్టం కాదు. పైగా గీతాసంస్థ సినిమాలు, వ్యవహారాలు, పెట్టుబడులు, ఇలాంటివి బన్నీకి చాలా వున్నాయి.
బన్నీ ఏ సినిమాకు కూడా ముందుగా డబ్బులు తీసుకోడు. సినిమా మొత్తం పూర్తయిన తరువాత ఒకేసారి రెమ్యూనిరేషన్ తీసుకోవడం అన్నది అతని అలవాటు. అదే విధంగా వచ్చిన ఆదాయాన్ని తన సన్నిహితుడు బన్నీ వాస్ ద్వారా ప్లాన్డ్ గా ఇన్వెస్ట్ చేయడం కూడా బన్నీ అలవాటు.