Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహోకి కొత్త తలనొప్పి

సాహోకి కొత్త తలనొప్పి

బాహుబలి ప్రభాస్ భారీ సినిమా సాహో సినిమాకు కొత్త తలనొప్పి వస్తొంది. కొన్ని ఓవర్ సీస్ ఆన్ లైన్ మాధ్యమాల నుంచి చిత్రమైన థ్రెట్ వస్తోందని సాహో యూనిట్ వర్గాల బోగట్టా. సినిమా ప్రీ రిలీజ్ టాక్, అని, సెన్సార్ టాక్ అని, ఇన్ సైడ్ టాక్ అని కథనాలు అమెరికా నుంచి ప్రచారంలోకి వస్తున్నాయి. అంతే కాదు కొన్ని వర్గాలు సినిమాకు ఎర్లీగా ట్వీట్ రివ్యూ వేస్తామని, ట్విట్టర్ లో ప్రీమియర్ టాక్ వేస్తామని, అదంతా పాజిటివ్ గా వుండాలంటే, తమకు సాహో నుంచి ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాల బోగట్టా.

అయితే సాహో ఓవర్ సీస్ వ్యవహారాలు అన్నీ యష్ రాజ్ ఫిలింస్ చూసుకుంటోంది. ఆ సంస్థ ప్రకటన విషయంలో కాస్త లిమిటెడ్ గా వుంటుంది. మన దగ్గర భారీ సినిమాలకు కుమ్మేసినట్లు ప్రకటనలు కుమ్మేయదు. మహా అయితే ఒకరోజు లేదా రెండు రోజులు ప్రకటనలు ఇస్తుంది.

దీంతో ఇప్పుడు సాహో యూనిట్ దిద్దుబాటు చర్యలకు దిగాలనే ఆలోచన చేద్దామన్నా వీలుకాని పరిస్థితి. ఎందుకంటే యూనిట్ కీలక బాధ్యులు అంతా సినిమా విడుదల, ఫైనల్ కాపీ, లోడింగ్ ఇట్లాంటి వ్యవహారాల్లో బిజీగా వున్నారు. ఈ విషయాలు ఏవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు.

దీంతో సాహో పబ్లిసిటీ యూనిట్ కూడా ఈ 'ట్వీట్ రివ్యూల బ్యాచ్'కు ఏ సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు. కానీ అప్పుడే నెగిటివ్ కథనాలు మాత్రం ప్రారంభమైపోయాయి. ఓవర్ సీస్ లో సినిమా టైమ్ కు, ఇండియాలో సినిమా టైమ్ కు చాలా తేడా వుండడం, ఓవర్ సీస్ లో సినిమా ముగిసేసరికి తెలుగునాట సినిమా ఇంకా బిగిన్ కాకపోవడం అన్నది, సినిమా సంగతి తెలుసుకోవడానికి ఓ ఛాయిస్ గా మారింది.

కొన్ని మాధ్యమాలు దీన్ని కాస్త పద్దతిగా వాడుతుంటే, ఇది అలుసుగా తీసుకుని మరికొన్ని మాధ్యమాలు ఈ దారిలోకి వచ్చి, సినిమా ప్రకటనల రూపంలో లబ్దిపొందే ఆలోచనలు చేస్తున్నాయి. ఈ బాధపడలేకే ఇటీవల ఓ సినిమా ప్రీమియర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.

సాహో లాంటి పెద్ద సినిమా అంటే ప్రచారం ఖర్చుకూడా భారీగా వుంటుందని ఆశిస్తారు. కానీ అలా లేకపోయే సరికి, ఆ సినిమా యూనిట్ కు కొత్త తలనొప్పులు పుట్టుకువస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?