ఎన్టీఆర్ బయోపిక్ కు ముగింపు అదే?

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగానికి కథానాయకుడు, రెండో భాగానికి మహానాయకుడు అనే టైటిల్స్ ఫిక్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే సెకెండ్ పార్ట్ ను ఎక్కడ…

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగానికి కథానాయకుడు, రెండో భాగానికి మహానాయకుడు అనే టైటిల్స్ ఫిక్స్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే సెకెండ్ పార్ట్ ను ఎక్కడ ముగిస్తారనే ఆసక్తిమాత్రం అందర్లో ఉంది.

చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్ ను చూపిస్తారనే భ్రమలు ప్రేక్షకుల్లో లేకపోయినా, ఎన్టీఆర్ జీవితాన్ని ఏ పాయింట్ దగ్గర ఎండ్ చేస్తారనే క్యూరియాసిటీ మాత్రం అందర్లో ఉంది. ఎట్టకేలకు ఆ మేటర్ పై చిన్నపాటి క్లారిటీ వచ్చింది.

ఎన్టీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టంతో ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా ముగుస్తుందట. ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల మీద అమెరికా వెళ్లినప్పుడు, ఎమ్మెల్యేల సహకారంతో నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారు.

అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఎలా ప్రజాఉద్యమాన్ని లేవనెత్తి తిరిగి తన అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నారనేది క్లైమాక్స్. ఈ క్రమంలో ఎన్టీఆర్ వీరావేశంతో చెప్పే ఓ డైలాగ్ తో సినిమాకు శుభం కార్డు పడుతుందని సమాచారం.

సో.. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు వెన్నుపోటు చూసే అవకాశం లేదు. మరీముఖ్యంగా కీలకమైన లక్ష్మీపార్వతి ఎపిసోడ్ కూడా బయోపిక్ లో లేదు. కేవలం ఎన్టీఆర్ ఉత్థాన దశను మాత్రమే బయోపిక్ లో చూపించి శుభంకార్డు వేయబోతున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లలో కూడా చిన్నపాటి మార్పులు చేశారు. ట్రయిలర్ రిలీజ్ ఒక రోజు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ మరో రోజు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడా రెండు ఈవెంట్లను కలిపి ఒకేసారి 21న నిర్వహించబోతున్నారు.

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే