దర్శకుడిగా మళ్లీ సరైన సినిమా పడలేదు కానీ కథకుడిగా, స్ట్రిప్ట్ రైటర్ గా బివిఎస్ రవి తెరవెనుక ఎప్పుడూ బిజీనే. లేటెస్ట్ గా ఆయన కథతోనే ఏస్ డైరక్టర్ విక్రమ్ కుమార్ ఓ సినిమాను నాగ్ చైతన్య హీరోగా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుంటే ఒకేసారి బివిఎస్ రవి అందిస్తున్న మూడు స్ట్రిప్ట్ లతో ఎటిటి కోసం మూడు సినిమాలు రెడీ చేయబోతున్నారు. ప్రవీణ్ అనే కొత్త డైరక్టర్ వీటికి వర్క్ చేస్తారు. వీటిలో ఒక దాని పేరు రేవ్ పార్టీ.
టైటిల్ లోనో మాంచి యూత్ మజాను నింపేసారు. మిగిలిన రెండు కథలు కూడా యూత్ ఫుల్ ఇంట్రస్ట్ వున్నవే. శ్రేయాస్ ఎటిటితో కుదిరిన ఓప్పందం మేరకు బివిఎస్ రవి వీటికి రూపకల్పన చేస్తున్నట్ల బోగట్టా. ఇదిలా వుంటే నిన్నటి తరం దర్శకుడు శివ నాగేశ్వర రావు కూడా ఓ ఎటిటి ఫిలిం తయారుచేసే పనిలో బిజీగావున్నారు.
డివివి దానయ్య కుమారుడిని లాంచ్ చేయబోతున్న డైరక్టర్ శ్రీవాస్ కూడా తన అసిస్టెంట్ ను డైరక్టర్ ను చేస్తూ ఓ ఎటిటి ఫిలిం నిర్మించబోతున్నారు. మొత్తానికి కరోనా లాక్ డౌన్ నేపథ్యలో పుట్టుకువచ్చిన ఏటిటి కాన్సెప్ట్ డైరక్టర్లకు అదనపు ఆదాయం, వారి శిష్యులకు ప్రమోషన్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.