విశాఖలో పరిపాలనా రాజధాని అని జగన్ నినదించారు. ఆయన ఒక్క విశాఖకే కాదు, ఏపీలో ఉన్న మూడు ప్రాంతాలకూ న్యాయం జరగాలని భావిస్తున్నారు అందుకే పాలనకు విశాఖ అనువైనదిగా గుర్తించారు. దీన్ని చంద్రబాబు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు.
ఎంత గట్టిగా అంటే రోజుకు ఒకసారి జూం మీటింగ్ పెట్టి మరీ అదే పనిగా ఊదరగొడుతున్నారు. అమరావతే మన రాజధాని అంటూ రచ్చ చేస్తున్నారు. సరే చంద్రబాబు పాలసీ అది. కానీ ఆయన ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని జూం ద్వారా హడావుడి ఎంత చేసినా లోకల్ గా ఉంటే తమ్ముళ్లకు మాత్రం అది చాలా ఇబ్బందిగా ఉందిట.
ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన తమ్ముళ్ళు అయితే మౌనమే మా భాష అనేస్తున్నారు ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతవరకూ దీని మీద నెగిటివ్ గా మాట్లాడింది లేదు, అందులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఏకంగా అసెంబ్లీలో జై అమరావతి అంటూ స్పీకర్ వెనకాల నిలబడి అప్పట్లో నినాదాలు చేశారు.
అటువంటి హార్డ్ కోర్ అమరావతి రాజధాని ఫ్యాన్ టోన్ కూడా ఇపుడు ఎక్కడా సౌండ్ చేయడంలేదు. ఇంకో వైపు బాబు నుంచి అమరావతి కోసం పోరాటం చేయమని గట్టిగానే వత్తిడి వస్తోందిట. దాంతో తమ్ముళ్ళు ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నట్లుగా భోగట్టా. అదేంటీ అంటే విశాఖ రాజధానికి జగన్ శంఖుస్థాపన చేసిన రోజే టీడీపీకి గుమ్మడి కాయ కొట్టేసి వైసీపీలోకి దూకేయాలనిట. మొత్తానికి రాజధాని గొడవ కాదు కానీ ఉత్తరాంధ్రాలో టీడీపీ జాతకాన్నే మార్చేసేలా ఉందని ఆ పార్టీలోనే గట్టిగానే చర్చ సాగుతోందిట. చూడాలి ఎంతమంది గోడ దూకుతారో.