మంత్రి కాదు.. మహరాజే..!

రాజకీయాల్లో విలువలు వంకాయలు అంటూ చాదస్తం కబుర్లకు కాలం చెల్లిన రోజులివి. కానీ విలువలే ఆశగా శ్వాసగా చేసుకుని బతికిన పాతత‌రం నాయకులలో పెన్మత్స సాంబశివరాజు ఒకరు. ఆయన మరణంతో ఆ తరం అంతరించిదనే…

రాజకీయాల్లో విలువలు వంకాయలు అంటూ చాదస్తం కబుర్లకు కాలం చెల్లిన రోజులివి. కానీ విలువలే ఆశగా శ్వాసగా చేసుకుని బతికిన పాతత‌రం నాయకులలో పెన్మత్స సాంబశివరాజు ఒకరు. ఆయన మరణంతో ఆ తరం అంతరించిదనే చెప్పాలి.

అచ్చమైన నేతకు, మచ్చలేని వ్యక్తిత్వానికి కూడా రాజు గారు నిదర్శనం. సాంబశివరాజుది తొమ్మిది పదుల జీవితమైతే అందులో ఆరున్నర పదుల  ప్రజాజీవితం ఉంది. ఓ వైపు పూసపాటి సంస్థానధీశులు విజయనగరం జిల్లాను శాసిస్తున్న రోజుల్లో తన ఉనికిని చాటుకుని ధీటుగా నిలబడడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

పైగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో కొనసాగారు, జగన్ పార్టీ పెట్టాక కాంగ్రెస్ తీరుతెన్నులు చూసి విసిగి ఆ పార్టీకి గుడ్ బై కొట్టారు. వైసిపీలో చేరి  జగన్ కి నైతికంగా ఎంతో బలం ఇచ్చిన రాజు మరణం ఆ పార్టీకి పెద్ద లోటుగా చెప్పుకోవాలి. ఆనాడు మూడు నెలల ఎంపీగా ఉంటూ కాంగ్రెస్ వంటి కొండని ధిక్కరించిన జగన్ కి రాజకీయ శిఖరంగా ఉన్న రాజు అండగా నిలవడమే కాదు జగన్ లో నాడే భావి నాయకుడిని చూశారనుకోవాలి.  ఇక రాజు గారు బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభద్రస్వామి వంటి నాయకులను తయారు చేశారు. ఇంకా ఎందరో ఆయన శిష్యులు, ప్రశిష్యులు ఉన్నారు.

ఎనిమిది సార్లు శాసనసభ్యునిగా ఉన్నా ఒకే ఒకసారి మంత్రి అయ్యారు. అది కూడా నేదురుమల్లి జనార్ధనరెడ్డి హయాంలో ఆయనకు అవకాశం దక్కింది. అవినీతి అన్న మాట ఆయన మొత్తం కెరీర్లో ఎక్కడా లేదు. చిన్నమెత్తు ఆరోపణ లేకుండా రాజకీయ సాగర మధనం చేసిన మేటిగా రాజు గారిని చెప్పుకోవాలి. ఆయనను జనాలు ఎపుడూ మంత్రిగా చూడాలనుకోలేదు, రాజుగానే చూశారు. అందుకే ఆయన కూడా వారి గుండెల్లో మహారాజుగానే ఎప్పటికీ  కొలువుండిపోయారు.

నాలుగు దశాబ్దాల తెలుగుదేశం

రైతులు త్యాగం చేశారా.. డీల్ చేసుకున్నారా ?