ఆమె నట జీవితంలో తరచు గ్యాసిప్ లే..అప్పుడప్పుడు వివాదాలే. కొన్నాళ్ల క్రితం ఇండస్టీలోని ఓ నిర్మాత అభిమానం చూరగొందని గ్యాసిప్ లు వినిపించాయి. అక్కడి నుంచి ఆ నిర్మాతకు సంబంధాలు వున్న సినిమాలు అన్నింటిలో ఆమెకు పాత్రలు వస్తూ వచ్చాయి. దాంతో గ్యాసిప్ లు కాస్త బలంగానే వినిపిస్తూ వచ్చాయి.
లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ వేరుగా వుంది. ఆ హీరోయిన్ తన స్నేహం వేరే నిర్మాత వైపు మార్చిందని వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు అక్కడ అవకాశాలు పెరిగాయి. ఆ నిర్మాత సినిమాల్లో వరుసగా ఆఫర్లు క్రియేట్ అవుతున్నాయని బోగట్టా.
ఇప్పటికే ఓ సినిమాలో చేసింది. మరో సినిమాలో చేస్తోంది. ఇంకో సినిమాకు ఎంపికయినట్లు తెలుస్తోంది. ఆ మూడో చాన్స్ చాలా భారీ, ప్రెస్టీజియస్ సినిమాలో కావడంతో టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
గత స్నేహం కన్నా, ఈ స్నేహమే ఆమె కెరీర్ కు బాగా ఉపయోగపడుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.