సినిమాకు యాక్టర్లు రోజువారీ పారితోషికం మామూలే. సినిమా షూటింగ్ కోసం ఓ కారుకు కూడా యాక్టర్లు లెవెల్ లో పారితోషికం ఇవ్వాల్సి వస్తే. శమంతకమణి సినిమా కోసం అదే చేయాల్సి వచ్చిందట.
శమంతకమణి సినిమా ఓ ఖరీదైన రోల్స్ రాయిస్ కారు చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి కారు ఖరీదు కోట్లలో వుంటుంది. సినిమా కోసం దాన్ని కొనాలంటే చిన్న సినిమా బడ్జెట్ కాస్తా పెద్ద సినిమా బడ్జెట్ అయిపోతుంది.
అందుకే శమంతకమణి కోసం కథకు సరిపడే సరైన కారును పాతబస్తీ ప్రాంతంలోని ఓ పెద్దాయిన దగ్గర నుంచి అద్దెకు సంపాదించారట. అద్దె రోజుకు సింపుల్ గా 40 వేలు. వాడినా వాడకున్నా, కారు అయితే లొకేషన్ లో వుండాలిగా.
దాదాపు సినిమా షూట్ నడిచినన్నాళ్లు కారుకు కూడా రోజువారీ కాల్ షీట్ లెక్కన డబ్బులు చెల్లించారట నిర్మాత. వాస్తవానికి శమంతక మణిలో నలుగురు హీరోలు. కారుతో కలిపి అయిదుగురు అనుకోవాలి