కారవాన్ లో 30 లక్షలు మాయం?

ఓ యంగ్ హీరో కారవాన్ లో ముఫై లక్షలు మాయమయ్యాయి. అయితే ఈ సంగతి హఢావుడి చేయకుండా గుట్టుగానే వుంచారు. అయితే దీని ఫలితం ఆ యంగ్ హీరో దగ్గర పని చేసే కీలక…

ఓ యంగ్ హీరో కారవాన్ లో ముఫై లక్షలు మాయమయ్యాయి. అయితే ఈ సంగతి హఢావుడి చేయకుండా గుట్టుగానే వుంచారు. అయితే దీని ఫలితం ఆ యంగ్ హీరో దగ్గర పని చేసే కీలక వ్యక్తిపై పడనున్నట్లు వినికిడి. ఆ జాబ్ నుంచి ఆ వ్యక్తిని మార్చి వేరేవాళ్లను పెట్టుకోవాలని ఆ యంగ్ హీరో ఆలోచిస్తున్నట్లు బోగట్టా. 

ఆచి తూచి సినిమాలు చేస్తూ, ఏటా పండుగకు ఓ హిట్ కొట్టడం ఆనవాయితీగా పెట్టుకున్నాడా యంగ్ హీరో. పెద్దగా హడావుడి పడకుండా, మంచి సబ్జెక్ట్ లు, వైవిధ్యమైన వాటి కోసం చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ మధ్య అలాగే ఓ ఫ్యామిలీ సినిమా చేసాడు. ఇప్పడు ఓ ఎంటర్ టైన్ మెంట్ సినిమా చేస్తున్నాడు. 

మరి ఆ సినిమా షూటింగ్ సమయంలో మాయం అయ్యాయో, లేక వేరే సమయంలో మాయం అయ్యాయో తెలియదు కానీ, ముఫై లక్షలు మాయం అయినట్లు తెలుస్తోంది. కానీ దీనిని బయటకు పొక్కనివ్వలేదు. ప్రస్తుతానికి ఎవరినీ నిలదీయలేదు. కానీ ఓ కీలక ఉద్యోగిని మాత్రం మార్చాలని చూస్తున్నట్లు వినికిడి..