అల్లుఅర్జున్, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి నిర్ణయాధికారం మొత్తాన్ని తన వద్ద అట్టిపెట్టుకున్నాడు త్రివిక్రమ్. నిర్మాతల్ని పక్కనపెడితే, బన్నీకి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వడంలేదు. మ్యూజిక్ డైరక్టర్, హీరోయిన్ విషయంలో తనమాటే నెగ్గించుకున్న ఈ దర్శకుడు, ఒకేఒక్క విషయంలో మాత్రం బన్నీకి ఛాన్స్ ఇచ్చాడు.
త్రివిక్రమ్ సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ కామన్ కదా. బన్నీతో చేయబోయే సినిమాలో కూడా సెకెండ్ హీరోయిన్ ఉంది. ఆ ఎంపికను మాత్రం బన్నీకి విడిచిపెట్టాడట త్రివిక్రమ్. అల్లుఅర్జున్ కోరిక మేరకు క్యాథరీన్ త్రెసాను ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా తీసుకున్నారట.
బన్నీ-క్యాథరీన్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏమాత్రం కుదిరినా క్యాథరీన్ కు ఓ ఛాన్స్ ఇవ్వాలని చూస్తుంటాడు బన్నీ. గతంలో వీళ్లిద్దరూ కలిసి ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలు చేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం రావడంతో వెంటనే ఆమెను తన కొత్త సినిమాలో తీసుకున్నాడు. మెయిన్ హీరోయిన్ తో పాటు క్యాథరీన్ సెలక్షన్ ను ఒకేసారి ప్రకటిస్తారట.
నిజానికి ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ ను తీసుకోవాలని బన్నీ అనుకున్నాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం తమన్ ను తీసుకున్నాడు. హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోవడం బన్నీకి ఇష్టంలేదు. త్రివిక్రమ్ మాత్రం పూజానే కావాలంటున్నాడు. క్యాథరీన్ విషయంలో మాత్రం బన్నీ తనపంతం నెగ్గించుకున్నట్టున్నాడు.