సీడెడ్ అంటే నందమూరి బాలకృష్ణ అడ్డా. అక్కడ ఆయన సినిమాలు దున్నుడే దున్నడు. మిగిలిన హీరోలకు ఈ సంగతి తెలుసు. మిగిలిన ఏరియాల సంగతి బాలయ్యకు తెలుసు. కానీ చిత్రంగా ఈసారి గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విషయంలో ఇది రివర్స్ అవుతోంది.
కలెక్షన్ల విషయంలో సీడెడ్ కన్నా మిగిలిన ఏరియాలే మిన్నగా వున్నాయని తెలుస్తోంది. మిగిలిన ఏరియాలన్నీ త్వరగా బ్రేక్ ఈవెన్ కు వచ్చేస్తున్నాయి కానీ, సీడెడ్ కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
బాలయ్య సీడెడ్ అభిమానులు ఇష్టపడే కథాశం, స్టయిల్ ఆఫ్ యాక్షన్ కాకుండా వేరే విధంగా గౌతమీ పుత్రుడు వుండడమే ఇందుకు కారణంగా అనుకుంటున్నారు. ఇదే కనుక బాలయ్య తన స్టయిల్ ఎమోషనల్ యాక్షన్ సినిమా కనుక చేసి వుంటే సీడెడ్ నే అన్నింటికన్నా ముందు వుండి వుండేదని చెబుతున్నారు. బహుశా అది కూడా నిజమే కావచ్చు.
ఎందుకంటే బాలయ్యకు మిగిలిన వారితో పోల్చుకుంటే కాస్త తక్కువ మార్కెట్ వుండే నైజాంలో శాతకర్ణి ఓకె అనిపించుకుంది. హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో ఇంకా నలభై షో ల వరకు శాతకర్ణి రన్ అవుతోంది. అంటే గౌతమీ పుత్రుడు సీడెడ్ లాంటి బి సెంటర్లు ఎక్కువగా వుండే ఏరియాలో కన్నా, హైదరాబాద్, విశాఖ ల్లాంటి ఎ సెంటర్లు ఎక్కువగా వుండే ఏరియా వారికే నచ్చిందనుకోవాలి.