ఓ పాపులర్ చానల్ లో వస్తున్న ఓ ఇన్ హవుస్ సెలబ్రిటీ షో వెనుక రగడ జరుగుతున్నట్లు గ్యాసిప్ లు గుప్పుమంటున్నాయి. ఈ షోకి ఎంపిక కావడం కోసం కాస్త రాజకీయనేపథ్యం వున్న వ్యక్తి దాదాపు కొన్ని లక్షలు ఖర్చు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీన్ని మూడు భాగాలుగా చేసి, ఓ మధ్యవర్తికి, చానెల్ తో సంబంధాలున్న ఇధ్దరికి ఇచ్చినట్లు తెలుస్తోంది. వారి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కొన్ని వారాల పాటు ఆ షో లో ఆ వ్యక్తి వుండేలా చూస్తామని మాట ఇచ్చినట్లు వినిపిస్తోంది.
కానీ అలా అనుకున్నట్లు జరగలేదు. దాంతో అఫెండ్ అయిన ఆ వ్యక్తి, ఈ విషయమై డబ్బుల లావాదేవీలో ఇన్ వాల్వ్ అయిన వారందరినీ నిలదీసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మీడియా మీట్ కూడా పెడతానని బెదిరించారని వార్తలు వినవ్తస్తున్నాయి.
దీనికి శుక్రవారం పొద్దుపోయేవరకు మల్లగుల్లాలు పడినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. ఏం జరిగిందన్నది వారికే తెలియాలి.
ఆ వ్యక్తి బయటకు వచ్చి నోరు విప్పితే తప్ప, ఈ గ్యాసిప్ లు వట్టి గ్యాసిప్ లేనా, సరైన విషయం వుందా అన్నది క్లియర్ కాదు.