Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సెన్సారుపై గుసగుసలు

సెన్సారుపై గుసగుసలు

తెలుగు సినిమాల సెన్సారు వ్యవహారాలపై గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల సెన్సారు వ్యవహారాల్లో డబ్బులు చాలా గట్టిగా చేతులు మారుతున్నాయని ఇండస్ట్రీ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తోంది.

గతంలో ఇంతలా లేదని, ఏదో ఉడతా భక్తిగా ఇస్తే తీసుకోవడం లేదంటే లేదు అనేట్లు వుండేదని, కానీ ఇప్పుడు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని నిర్మాతలు ఆఫ్ ది రికార్డుగా అంటున్నారు

సినిమాలు లైన్ గా చూడాలి అన్న రూల్ ను అడ్డం పెట్టుకుని ఇదంతా జరుగుతోందని, విడుదల డేట్ పది రోజులు మందు ఫిక్స్ చేసుకుంటే, సెన్సారుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అలాంటి టైమ్ లో ఈ డబ్బు లావాదేవీలు ఎక్కువగా వుంటున్నాయని అంటున్నారు. ఈ విషయంలో రెండు అక్షరాల పేరున్న ఓ మధ్యవర్తి ద్వారా పనులు జరుగుతున్నాయని టాక్.

కొద్ది రోజుల్లో రాబోయే ఓ సినిమా విడుదల దాదాపు లేనట్లే అన్నంత పరిస్థితి సృష్టించి, ఆఖరికి పదిలక్షల తో వ్యవహారం సెటిల్ చేసారని, దాంతో ఆ యూనిట్ డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చిందని ఓ నిర్మాత వెల్లడించారు.

త్వరలో టాలీవుడ్ సెన్సారు వ్యవహారాలను బాహాటంగానే నిలదీయడానికి ఒకరిద్దరు నిర్మాతలు సన్నద్ధం అవుతున్నట్లు బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?