మొత్తానికి సంక్రాంతికి వచ్చే నాలుగు సినిమాల్లో మూడు సినిమాల సెన్సారు పూర్తయిపోయింది.దీంతో సెన్సారు పేరు చెప్పి, టాలీవుడ్ లో రకరకాల ఒపీనియన్లు షికారు చేస్తున్నాయి. పైగా సినిమాలు ల్యాబ్ లో చూడడంతో మరీ ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి.
సోగ్గాడే చిన్ని నాయనా ఫస్ట్ హాఫ్ బాగుందని…ఫన్..బాగా పండిందని టాక్.సెకండాఫ్ ఫ్యామిలీ అటాచ్ మెంట్లు, సెంటిమెంట్ పై మళ్లిందని, చివరి పది నిమషాలు బాగానేవుందని టాక్ వినిపిస్తోంది.
ఎక్స్ ప్రెస్ రాజా ఫరవాలేదని, పాస్ మార్కులు తెచ్చేసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. యూత్ కు కనెక్ట్ అయ్యే ఫన్ బాగానే పండిందని అంటున్నారు.
డిక్టేటర్ లో పృధ్వీ ఎపిసోడ్ మళ్లీ పండిందని టాక్. బాలయ్య కొత్తగా కనిపిస్తాడని, సినిమా ఖర్చు స్క్రీన్ పై గ్రాండ్ గా కనిపించిందని అంటున్నారు.
నాన్నకు ప్రేమతో ఇంకా సెన్సారుకు వెళ్లాల్సి వుంది. అప్పుడేం మాటలు వినిపిస్తాయో మరి.