సోగ్గాడే చిన్ని నాయనా..నాగార్జునకు 2016 ఫస్ట్ మూవీ..పైగా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో రసికత పాలు కాస్త ఎక్కువే వుందని గుసగుస వినిపిస్తోంది. సీనియర్ నాగార్జున క్యారెక్టర్ సినిమాలో కనిపించినంత సేపూ రసికత వొలకబోస్తుందని, ఎక్కవగా డైలాగులు, అక్కడక్కడ సీన్లు ఫ్యామిలీ జనాలు ముసి ముసి నవ్వులు నవ్వుకునేలా చేస్తాయంటున్నారు.
ఇప్పటికే ట్రైలర్ లో గిత్తలు కుమ్మేస్తన్నాయే..డైలాగ్ బాగా పాపులర్ అయిపోయింది. ఈ సీన్లు, డైలాగులు వుంటాయని అంచనా వేసిన వారు, సినిమాకు ఎ సర్టిఫెకెట్ వస్తుందేమో అనుకున్నారట. కానీ యు/ఎ వచ్చింది..అందువల్ల ఇక జనాలు సకుటుంబ సపరివారంగా చూసేయచ్చు..నాగ్ రొమాన్స్ ను. ఓపక్క రమ్యకృష్ణ..మరోపక్క లావణ్య త్రిపాఠీ నాగ్ తో మెరుపులు మెరిపించారు ఈ సినిమాలో.