ఎఫ్-2 ప్రభావం మల్టీస్టారర్స్ పై బాగాపడింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, పైగా కామెడీ వర్కవుట్ అవ్వడంతో వెంకీమామ సినిమాలో కూడా అందుకు తగ్గట్టు భారీ మార్పుచేర్పులు చేశారు. నెలరోజులు ఎక్స్ ట్రా టైమ్ తీసుకొని మరీ ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ పెంచారు. ఇన్ని చేసినా వెంకీమామ భయపెడుతోంది. దీనికి కారణం సినిమాలో యాక్షన్ పార్ట్.
అవును.. ఈ సినిమాల మిలట్రీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు నాగచైతన్య. దీనికి తోడు ఎమోషనల్ పార్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందట. యాక్షన్ ఇమేజ్ అచ్చిరాని నాగచైతన్యతో, మిలట్రీ ఆఫీసర్ రోల్ వేయించడం ఓ రిస్క్ అయితే.. వెంకటేష్ తో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ప్లాన్ చేయడం మరో రిస్క్.
భావోద్వేగాలు పండించడంలో వెంకీని ఏమాత్రం తక్కువ చేయలేం. ఎమోషనల్ సీన్స్ ను పీక్స్ లో పండించగలడు వెంకీ. కానీ ఇప్పుడు వెంకీని ఆడియన్స్ మొత్తం కామెడీ యాంగిల్ లోనే చూస్తున్నారు. అందుకే వెంకీమామలో కామెడీని కాస్త చొప్పించినప్పటికీ.. ఎమోషనల్ కంటెంట్ అంతకంటే ఎక్కువగా ఉందట.
ఈరోజు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్లుగా నటించబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.