ఆర్జీవీ సినిమాలకు గత కొంతకాలంగా మార్కెట్ లేదు. నాగ్ తో నిర్మించిన ఆఫీసర్ కూడా సరిగ్గా నడవలేదు. అలాంటి నేపథ్యంలో ఆయన తలకెత్తుకున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మాంచి ప్రైస్ కు అమ్ముడుపోయింది. అది కూడా ఫస్ట్ కాపీతో వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు అమ్మేసారు.
ఆర్ ఎక్స్ 100, యుటర్న్ లాంటి అనేక విజయవంతమైన సినిమాలు అవుట్ రేట్ కు ఫస్ట్ కాపీ కొని డిస్ట్రిబ్యూట్ చేసి శివం సెల్యులాయిడ్ సంస్థ (సురేష్ రెడ్డి) లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్ట్ కాపీని వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు కొనేసారు. నిర్మాతకు మాంచి ప్రైస్ ఇచ్చి హక్కులు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓవర్ సీస్, కర్ణాటక, ఆంధ్ర, నైజాం, సీడెడ్, తమిళనాడు ఇలా అన్ని ఏరియాల థియేటర్ హక్కులకు తొమ్మిది కోట్ల వరకు ఇవ్వడానికి ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాత ఎంత ఖర్చు చేస్తున్నారో తెలియదు కానీ, బిజినెస్ అన్ని విధాలా కలిపి 12 కోట్లకు పైగా అవుతుందని అంచనా.
మార్చి 15న సినిమా విడుదలకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారు. ఈవారంలోనే సెన్సారు ముందుకు సినిమా వస్తుందని అంచనా. మరి ఈ విషయంలో నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తాయో చూడాలి.