చైతన్య ‘హలోబ్రదర్ ప్లస్’

నాగ్ కెరీర్ లో హలో బ్రదర్ ఓ గుర్తుండిపోయే సినిమా. కన్ఫ్యూజన్ కామెడీలో ఒక కొత్త స్టయిల్. ఈవీవీ ఆ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా మలిచాడు.…

నాగ్ కెరీర్ లో హలో బ్రదర్ ఓ గుర్తుండిపోయే సినిమా. కన్ఫ్యూజన్ కామెడీలో ఒక కొత్త స్టయిల్. ఈవీవీ ఆ సినిమాను అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా మలిచాడు. అలాంటి సినిమాను చైతూకి ఇవ్వాలని ఎప్పటి నుంచో నాగ్ కోరిక. సవ్యసాచి సినిమా ట్రయిలర్ చూస్తుంటే ఇదే గుర్తుకువస్తుంది.

అయితే ఇది హలో బ్రదర్ మాత్రమే కాదు. అంతకు మించి. అంటే హలో బ్రదర్ ప్లస్ అన్నమాట. హలో బ్రదర్ లో కేవలం ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే వుంటుంది. సవ్యసాచిలో దీనికి యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే కాస్త ఫ్యామిలీ ఎమోషన్లు కూడా.

ట్రయిలర్ తొలిసగంలో చైతూ 'విక్రమ్-ఆదిత్య' అనే రెండు చేతులు.. రెండు షేడ్స్ ను బాగా చూపించారు. మలి సగంలో రెగ్యులర్ యాక్షన్ ఫార్మాట్ లోకి వెళ్లారు. ట్రయిలర్ లో ఒకటి రెండు కట్ లు ఒకే సీన్లోవి అన్నట్లుగా, ఒకటీ, అరా సీన్లు ట్రయిలర్ లోకి తప్పక తెచ్చినట్లుగా వున్నాయి. ఒక్క సాంగ్ బిట్ కూడా కట్ చేయకపోవడం ఎందుకో మరి మేకర్లకే తెలియాలి.

ఓవరాల్ గా ప్రామిసింగ్ కానే వుంది సవ్యసాచి ట్రయిలర్. ఈ సినిమా నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.