Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతన్యకు అక్కడ అంత వుందా?

చైతన్యకు అక్కడ అంత వుందా?

చైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సవ్యసాచి సినిమాను మూడు కోట్లకు పైగా చెల్లించి ఓవర్ సీస్ హక్కులు తీసుకున్నారన్నది చాలా చాలా పాత వార్త. ఇప్పుడు లేటెస్ట్ గా మారుతి కాంబినేషన్ లోని శైలజా రెడ్డి అల్లుడు హక్కులు కూడా మూడు కోట్లకు పైగా కోట్ చేస్తున్నారట. దీని కోసం ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డి బేరాలు సాగిస్తున్నట్లు వినికిడి.

ఈ సినిమానే కాదు, శర్వా-సుధీర్ వర్మ సినిమా కోసం కూడా మాటలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమాకు అంత రేటు వుండకపోవచ్చు. ఆ విషయం అలా వుంచితే నాగచైతన్య సినిమా మీద ఇంతంత రేట్ లు కోట్ చేయడమే ఆశ్చర్యంగా వుంది. వన్ మిలియన్ చేస్తే తప్ప మూడు కోట్లకు పైగా చెల్లించి కొనే బయ్యర్ కు వర్కవుట్ కాదు.

నాగచైతన్య సినిమాలు వన్ మిలియన్ కు పైగా చేయాలి అంటే కాస్త విషయం వుండాల్సిందే. ఓవర్ సీస్ లో యాక్షన్ సినిమాలకు క్రేజ్ తక్కువ. సవ్యసాచి సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా. మరి ఆ సినిమా అక్కడ వన్ మిలియన్ క్లబ్ లో చేరాలి అంటే చాలా విషయం వుండాలి. అలాగే శైలజ రెడ్డి అల్లుడు సినిమాకు దర్శకుడు మారుతి తప్ప మరో పుల్లింగ్ ఫ్యాక్టర్ లేదు. అను ఇమ్మాన్యుయేల్ ఇప్పటికే రెండు ఫ్లాపులు చవిచూసింది. ఇది తేడా వస్తే హ్యాట్రిక్ పూర్తవుతుంది. చైతూ చేత ఏ మేరకు కామెడీ చేయించగలిగారు అన్నదాన్ని బట్టి సినిమా సక్సెస్ వుంటుంది.

మరి ఇలాంటి సినిమాకు మూడుకు పైగా కోట్ చేయడం అంటే కాస్త సాహసమే అనుకోవాలి. ఓ పక్క ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి ట్రయ్ చేస్తుంటే, మరో పక్క బ్లూ స్కై జనాలు త్రివిక్రమ్, మారుతి, సుధీర్ వర్మ, వెంకీ కుడుమల సినిమాలు నాలుగు కలిసి కొనాలని చూస్తున్నారు. నాలుగు సినిమాలు కలిసి 20కోట్లకు పైగా కోట్ చేస్తున్నారట నిర్మాతలు. అంటే నాలుగు సినిమాలు కలిసి, అయిదు మిలియన్ల బిజినెస్ చేయాలి. సాధ్యమేనా? అనుమానమే?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?