చైతన్య ‘దుర్గ’ అటకెక్కిందా?

నాగ చైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘దుర్గ’ అనే చిత్రం ఆమధ్య అట్టహాసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. కారణాలేమిటో తెలియదు కానీ ఈ చిత్రాన్ని ఆపేయాలని…

నాగ చైతన్య హీరోగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ‘దుర్గ’ అనే చిత్రం ఆమధ్య అట్టహాసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. కారణాలేమిటో తెలియదు కానీ ఈ చిత్రాన్ని ఆపేయాలని నాగచైతన్య, శ్రీనివాసరెడ్డి నిర్ణయించుకున్నారట. 

ఈ చిత్రం కథ కోసం శ్రీనివాసరెడ్డి చాలా రోజుల పాటు కసరత్తు చేసాడు. మొదట ఈ కాంబినేషన్‌లో హలో బ్రదర్‌ రీమేక్‌ చేద్దామని అనుకున్నారు. దాని కోసం కొంత వర్క్‌ జరిగిన తర్వాత ఆ ఐడియా డ్రాప్‌ అయ్యారు. ఫైనల్‌గా దుర్గ కథని చైతన్య ఓకే చేసాడు. 

హీరోయిన్‌గా హన్సికతో పాటు మిగతా తారాగణం, ఇతర సాంకేతిక వర్గం అంతా ఖరారైంది. సినిమా కూడా ఘనంగా ప్రారంభమైంది. ఇది తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని చైతన్య చెప్పుకొచ్చాడు. మరిప్పుడు సడన్‌గా ఏమైందో కానీ దుర్గ అటకెక్కేసిందంట. ఇంకా అధికారికంగా దీనికి సంబంధించి ఇన్‌ఫర్మేషన్‌ లేదు.