బెజవాడ రౌడీలు పేరుతో వర్మ ఓ సినిమా తీశాడు. ఆ టైటిల్ వినగానే విజయవాడ వాసులంతా గగ్గోలు చేశారు. దాంతో రౌడీలు కట్ అయ్యి.. బెజవాడగా వచ్చింది. అయితే వర్మ అందులో చూపించాల్సిందంతా చూపించేశాడు. అయితే ఆటోనగర్ సూర్యలో బెజవాడ రౌడీయిజానికి మరో రూపు ఇచ్చారట. ఇరవై ఏళ్లక్రితం అక్కడున్న రాజకీయ పరిస్థితులేంటి? రౌడీయిజం ఏస్థాయిలో ఉంది? విజయవాడపై రాజకీయ నాయకుల కుతంత్రాలు ఎలా ఉంటాయి? ఈ అంశాలన్నీ ఆటోనగర్ సూర్యలో దర్శకుడు దేవాకట్టా చర్చించాడట.
వంగవీటి మోహనరంగను ఓ హీరోగా కీర్తిస్తూ చూపించారట. కొన్ని సంభాషణల్లో రంగ పేరు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపించారట. రంగ.. పేరు వాడుకొని ఈసినిమాపై క్రేజ్ తీసుకురావాలని చిత్రబృందం భావిస్తుందేమో..?? రంగ లేకపోయినా… విజయవాడలో రౌడీయిజం ఏదో ఓ పేరుతో విస్తరిస్తూనే ఉంది. ఈ దశలో విజయవాడ రౌడీయిజాన్ని మళ్లీ ఈ సినిమాతో కెలుకుతారేమో అనే అనుమానాలు వ్యాపించాయి.
సున్నితమైన విషయం కావడంతో సెన్సార్ సమస్యలూ తప్పకపోవచ్చు. కాకతాళియమే, మరేమిటో తెలీదు గానీ… బెజవాడ, ఆటోనగర్ సూర్య రెండింటిలోనూ నాగచైతన్య కథానాయకుడు. బెజవాడ ఫట్టయ్యింది…. మరి ఈ సూర్య ఏం చేస్తాడో..??