చైతూనే ఫిక్సయ్యాడా?

నితిన్..నాగచైతన్య..ఈ రెండు పేర్లు ఫైనల్ గా వినిపించాయి..దిగ్దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకు. నితిన్ తమ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి, మరీ ఎక్కువ పట్టుపట్టకుండా సైలంట్ గా వుండిపోయాడు నాగచైతన్య. తను కూడా మరీ పట్టుబట్టడం బాగుండదని,…

నితిన్..నాగచైతన్య..ఈ రెండు పేర్లు ఫైనల్ గా వినిపించాయి..దిగ్దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకు. నితిన్ తమ కుటుంబానికి సన్నిహితుడు కాబట్టి, మరీ ఎక్కువ పట్టుపట్టకుండా సైలంట్ గా వుండిపోయాడు నాగచైతన్య. తను కూడా మరీ పట్టుబట్టడం బాగుండదని, తన ఆప్షన్, అంగీకారం ఇచ్చి ఊరుకున్నాడు నితిన్. ఇప్పుడు త్రివిక్రమ్ నాగచైతన్యను ఫైనల్ డెసిషయన్ తీసకున్నాడని టాలీవుడ్ టాక్. 

కానీ ఏ విషయం అధికారికంగా ప్రకటిస్తే కానీ ఫైనల్ అనుకోవడానికి వీల్లేదు. చైతన్యకు ప్లస్ పాయింట్ ఏమిటంటే, హారిక హాసిన వద్ద అతని డేట్లు రెడీగా వుండడం. అయితే అవి చందు మొండేటి సినిమా కోసం తీసుకున్నవి. మరి ఇప్పుడు ఆ సినిమాను వెనక్కు నెడతారేమో చూడాలి. నితిన్ నే తీసుకోవాలని త్రివిక్రమ్ బలంగా అనుకున్నాడని, కానీ కొన్ని కారణాల వల్ల చైతూను తీసుకుంటున్నాడని టాలీవుడ్ గుసగుసల సారాంశం. కొద్ది రోజులు ఆగితే ఏ విషయం కన్ ఫర్మ్ అయిపోతుంది.