‘ఆటోనగర్ సూర్య’ రిలీజ్ కాకుండా నిలిచిపోయి ఉన్నా కానీ నాగ చైతన్య తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నాడు. రేపు మనం రిలీజ్ అవుతోండగా… అతని మరో సినిమా కూడా విడుదలకి సిద్ధమైపోయింది. ‘ఒక లైలా కోసం’ అంటూ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ కొండా తీస్తున్న చిత్రం దాదాపుగా పూర్తయింది.
వచ్చే నెలలోనే ఆ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయి. మనం తప్పకుండా తనకి భారీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్న నాగచైతన్య దాని వెంట రాబోతున్న ఒక లైలా కోసం కూడా ఘన విజయాన్ని అందుకుని తనని స్టార్‌ని చేస్తుందని అనుకుంటున్నాడు.
నాగార్జున తనయుడిగా హీరో కాక ముందే అభిమానుల్ని సంపాదించుకున్నా కానీ చైతన్య ఇంకా స్టార్డమ్ తెచ్చుకోలేదు. నాగార్జునలానే చైతన్యకి కూడా లేట్‌గా స్టార్డమ్ వస్తుందని ఫాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. దాని కోసం చైతన్యకి ఇంతకంటే మంచి టైమ్ దొరకదు. ఎందుకంటే ఏఎన్నార్ నటించిన లాస్ట్ సినిమాగా మనంపై అంచనాలు భారీ లెవల్లో ఉన్నాయి.