పూరి జగన్నాథ్ దర్శకుడిగా పీక్స్‌లో ఉన్నప్పుడు అతడిని వెంటాడి మరీ ‘ఆంధ్రావాలా’ చిత్రాన్ని చేసాడు ఎన్టీఆర్. చిరంజీవి కోసం పూరి రాసుకున్న కథని తన ఏజ్‌కి సూట్ కాకపోయినా కానీ బలవంతంగా చేసేసి ఫ్లాపయ్యాడు. ఇప్పుడు పూరితో సినిమా అంటేనే స్టార్ హీరోలంతా పక్కకి తప్పుకుంటున్న టైమ్‌లో మళ్లీ పూరితో సినిమా చేస్తున్నాడు.
వేగంగా ఒక సినిమా పూర్తి చేయాలనే ఒకే ఒక్క కారణంతో పూరి జగన్నాథ్‌కి ఎన్టీఆర్ అవకాశమిచ్చాడు. పూరి కథలకి కాలం చెల్లిపోయిందని తెలుసు కనుకే వేరే రచయితని తనే ఫిక్స్ చేసాడు. అయితే పూరితో ఈ టైమ్‌లో సినిమా చేయడమంటే అది ఖచ్చితంగా గ్యాంబులే అనాలి.
హిట్ డైరెక్టర్లని నమ్ముకున్నా కానీ ఎన్టీఆర్‌కి కలిసి రావడం లేదు. తాను ఎదురు చూస్తోన్న ఆ బ్లాక్‌బస్టర్ ఇంకా తనకి అందకుండా వేధిస్తూనే ఉంది. సో.. ఒక ఫ్లాప్ డైరెక్టర్‌కి ఛాన్సిచ్చి తనని తాను ప్రూవ్ చేసుకునే స్కోప్ ఇస్తే వర్కవుట్ కావచ్చు కదా అని ఎన్టీఆర్ భావిస్తున్నట్టున్నాడు. ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది తెలీదు కానీ… గతంలో పూరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మహేష్ అతనికి పోకిరి ఇచ్చాడు. తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.