చైతూ సై అన్నాడు…

నాగార్జున‌తో ప‌నిచేసిన ద‌ర్శకులు నాగ‌చైత‌న్యతో, చైతూతో సినిమా తీసిన ద‌ర్శకులు నాగ్‌తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ జాబితాలో వీరూపోట్ల కూడా చేరిపోయాడు. నాగ్‌తో ర‌గ‌డ చేయించిన ద‌ర్శకుడు వీరూపోట్ల‌. ఆ సినిమా…

నాగార్జున‌తో ప‌నిచేసిన ద‌ర్శకులు నాగ‌చైత‌న్యతో, చైతూతో సినిమా తీసిన ద‌ర్శకులు నాగ్‌తో సినిమాలు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ జాబితాలో వీరూపోట్ల కూడా చేరిపోయాడు. నాగ్‌తో ర‌గ‌డ చేయించిన ద‌ర్శకుడు వీరూపోట్ల‌. ఆ సినిమా మాస్‌కి బాగా నచ్చింది. ఆ సినిమా తర‌వాత దూసుకెళ్తా అంటూ విష్ణు తో జ‌త‌క‌ట్టాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఈ ద‌ర్శకుడు అన్నపూర్ణ కాంపౌండ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. 

చైతూ బాడీలాంగ్వేజ్‌కి అతికిన‌ట్టు స‌రిపోయే ఓ స‌బ్జెక్ట్ సిద్ధం చేసుకొన్నాడ‌ని టాక్‌.  చైతూ, నాగ్‌ల‌కు కూడా  క‌థ వినిపించాడ‌ట‌. నాగ్ ఈ సినిమా ఓటేశాడు కూడా. కానీ.. చైతూ డేట్లు స‌ర్దుబాటు చేయ‌డ‌మే క‌ష్ట‌మైపోతోంది. చైతు సినిమాలు వ‌రుస‌గా సెట్స్ పైకి వెళ్తున్నాయి. 

ప్రస్తుతం రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ జ‌రుపుకొంటున్నాయి. ఈ ద‌శ‌లో మూడో సినిమా కూడా ఓకే చెప్పి గంద‌ర‌గోళంలో ప‌డ‌డం చైతూకి ఇష్టం లేదు. అందుకే ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవ‌కాశాలున్నాయి. అయితే ఈ యేడాదిలోనే సినిమా చేద్దాం..అని వీరూకి మాటిచ్చాడ‌ట చైతూ.