చైతూ.. అందరికీ అదేమాట

ఇప్పుడు ఉన్నట్లుండి నాగచైతన్యకు డిమాండ్ పెరిగింది. ఇంతకాలం చేతిలో ఒకటి, ప్లానింగ్ లో ఒకటి అన్నట్లు సినిమాలు చేస్తూ వస్తున్న చైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ, మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో…

ఇప్పుడు ఉన్నట్లుండి నాగచైతన్యకు డిమాండ్ పెరిగింది. ఇంతకాలం చేతిలో ఒకటి, ప్లానింగ్ లో ఒకటి అన్నట్లు సినిమాలు చేస్తూ వస్తున్న చైతన్య ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ, మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో పెట్టాడు. మరో ఇద్దరు డైరక్టర్ల ను కన్సిడరేషన్ లో వుంచాడు.

అంతా బాగానే వుంది. హీరో నాని రెమ్యూనిరేషన్ పెంచేయడం, శర్వానంద్ చకచకా సినిమాలు చేయకపోవడం, మిగిలిన చాలా మంది యంగ్ బ్యాచ్ హీరోల మార్కెట్ ఓ మాదిరిగానే వుండడం, చైతూకు పది నుంచి పదిహేను కోట్ల మార్కెట్ వుండడం, అన్నింటకి మించి చైతూ రెమ్యూనిరేషన్ ఇంకా మూడు, మూడున్నరకోట్ల దగ్గరే వుండడంతో డిమాండ్ పెరిగింది.

కానీ అందరికీ ఒకే డేట్లు చెబుతుంటే కాస్త కన్ఫ్యూజవుతున్నారు మేకర్లు. ప్రస్తుతం సవ్యసాచి సినిమా చేస్తున్నాడు. దాంతో సమాంతరంగా శైలజరెడ్డి అల్లుడు సినిమాకు డేట్ లు ఇస్తా అన్నాడు. కానీ అది జరగలేదు. జూన్ నెలాఖరు వరకు దానికి వర్క్ వుంది.

ఇప్పుడు అటు బాబీతో చేయబోయే సినిమాక,, ఇటు శివ నిర్వాణతో చేయబోయే సినిమాకు జూన్ ఫస్ట్ నుంచి డేట్ లు ఇస్తానని చైతూ చెబుతున్నట్లు తెలుస్తోంది. కానీ అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే శైలజారెడ్డి వర్క్ జూన్ ఎండింగ్ వరకు వుంటుంది, దాంతో చేయబోయే నిర్మాతలకు అక్కడే ఓ నెల లేటు అవుతుంది. మరో పక్క ఇంకో రెండు ప్రాజెక్టుల మీద కూడా చైతన్య డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవన్నీ పక్కాగా లైన్ లో పెట్టకపోతే, ఒకేసారి రెండేసి సినిమాలు రెడీ అయిపోయి, విడుదల సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది.