శైలజారెడ్డి అల్లుడు గోవా వెళ్లాడు. ఒక్కడూ కాదు… శైలజారెడ్డి కూతుర్ని తీసుకునిమరీ. అక్కడ బీచ్ లో సాయం వేళ మాంచి డ్యూయట్ వేసుకున్నాడు. ఈ ఇద్దరికి ఫారిన్ భామలు తోడయ్యారు. మారుతి డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న శైలజారెడ్డి అల్లుడు సినిమా మొత్తం ఫినిష్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఆర్ ఆర్ మాత్రం పెండింగ్.
ఇదిలా వుంటే, ఒక్కపాటను అవసరం అనుకుంటే చివరగా చేద్దాం అని వుంచేసారు. సమంత గోవా విహారయాత్రలో వుంది. సరే అని చైతూ అక్కడికే వెళ్లాడు. హీరో అక్కడే వున్నాడు కదా అని శైలజారెడ్డి అల్లుడు బృందం కూడా అక్కడ వాలిపోయింది. దాంతో పాట పిక్చరైజేషన్ మొదలైపోయింది.
ఫస్ట్ డే వర్క్ శుక్రవారం పూర్తయిపోయింది. శని, ఆదివారాలతో పాటను పూర్తి చేసుకుని యూనిట్ వెనక్కు తిరిగివస్తుంది.