చరణ్‌ కోసం మహేష్‌ వెనక్కి వెళతాడా?

మహేష్‌, చరణ్‌ల మధ్య వున్న స్నేహం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ తీరికగా వున్నపుడల్లా కలిసి పార్టీలు చేసుకోవడం, ఫ్యామిలీస్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా కామన్‌గా జరుగుతోంది. అయితే ప్రొఫెషనల్‌గా…

మహేష్‌, చరణ్‌ల మధ్య వున్న స్నేహం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ తీరికగా వున్నపుడల్లా కలిసి పార్టీలు చేసుకోవడం, ఫ్యామిలీస్‌తో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా కామన్‌గా జరుగుతోంది. అయితే ప్రొఫెషనల్‌గా ఇద్దరి మధ్య వున్న పోటీ అయితే అలాగే వుంది. ఈ స్నేహితులు ఇద్దరి మధ్య ఒక చిత్రమైన క్లాష్‌ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.

మహేష్‌ నటిస్తోన్న 'మహర్షి' చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ అదే సమయానికి చరణ్‌ నిర్మిస్తోన్న మెగాస్టార్‌ చిత్రం 'సైరా' కూడా రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకవేళ సైరా రిలీజ్‌ అటు ఇటుగా అదే టైమ్‌లో జరిగినట్టయితే చరణ్‌ కోసం మహేష్‌ తన చిత్రాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తాడా?

అప్పట్లో బాహుబలి చిత్రం కోసం శ్రీమంతుడు రిలీజ్‌ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి కూడా అదే స్కేల్‌లో తెరకెక్కుతోన్న భారీ చిత్రం కనుక మహేష్‌ మళ్లీ ఈ చిత్రానికి కూడా పోటీరాకుండా తప్పుకుంటాడా లేక అసలు స్నేహితులు ఇద్దరూ ముందే మాట్లాడుకుని క్లాష్‌ అనేది రాకుండా జాగ్రత్త పడతారా?