త్వరలో రాబోయే చిత్రాల్లో యువతని విశేషంగా ఆకర్షిస్తోన్న విజయ్ దేవరకొండ చిత్రం 'గీత గోవిందం'కి మరో అడ్డంకి తొలగిపోయింది. 'శ్రీనివాస కళ్యాణం'తో ఈ చిత్రానికి త్రెట్ వుందని మొదట భావించారు కానీ, ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి 'గీత గోవిందం'కి అది అడ్డుకాదని తేలిపోయింది. ఇకపోతే ఆగస్టు 15న విడుదలయ్యే విజయ్ చిత్రానికి మళ్లీ ఆగస్ట్ 31 వరకు పోటీ వుండదు.
ఆగస్టు 31న వచ్చే 'శైలజా రెడ్డి అల్లుడు' వరకు ఆల్మోస్ట్ రూట్ అంతా క్లియర్‌గానే వుంది. ఇప్పటికిప్పుడు పెద్ద సినిమాలేవీ హడావుడిగా విడుదల చేయరు కనుక 'గీత గోవిందం' కనుక క్రేజ్‌కి తగ్గ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్‌ని దున్నేయవచ్చు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ నటించిన సోలో చిత్రం ఇదే కావడంతో యూత్ దీని కోసం బాగా ఎదురు చూస్తున్నారు.
గీత గోవిందం పాటలకి, ప్రోమోలకి వస్తోన్న స్పందనతో నిర్మాతలు కూడా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. వేసవిలో వచ్చిన మహానటి తర్వాత మళ్లీ పెద్ద సక్సెస్లేమీ రాలేదు. చిన్న చిత్రాలు మినహా బాక్సాఫీస్ వద్ద సందడి లేదు. ఈ చిత్రంతో కనుక విజయ్ తన సక్సెస్ స్టోరీ రిపీట్ చేస్తే మాత్రం హీరోగా అతడికి ఇక తిరుగుండదు.