ఒకప్పుడు చక్కగా ఆడియో ఫంక్షన్లు ఉండేవి. స్టార్ కాస్ట్ కు ఆడియన్స్ తో కనెక్షన్ ఏర్పడేది. కానీ అల్లు అరవింద్ ఈ పద్ధతికి చెక్ పెట్టారు. ఆడియోను నేరుగా మార్కెట్లోకి తీసుకొచ్చి, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. మెగా కాంపౌండ్ తో పాటు.. దాదాపు మిగతా హీరోలంతా ఇప్పుడు ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. అక్కినేని నాగచైతన్య కూడా దీనికి మినహాయింపు కాదు.
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను రెడీ చేశాడు నాగచైతన్య. ఈ సినిమా పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఒక్కోరోజు ఒక్కో పాటను రిలీజ్ చేయకుండా.. మే 1న ఒకేసారి పాటలన్నింటినీ యూట్యూబ్ లో అప్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మే 13న ఏర్పాటుచేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు. సినిమాను 19వ తేదీన విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంటే మూవీ రిలీజ్ కు సరిగ్గా వారం ముందు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారన్నమాట.
సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేస్తున్న మూవీ ఇదే. నిన్నే పెళ్లాడతా, మన్మధుడు సినిమాల్ని మిక్స్ చేసి రారండోయ్ సినిమాను తెరకెక్కించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.