ప్రేక్షకులను నిరాశ పర్చిన బాహుబలి

సాధారణంగా హీరోల అభిమానులు ఏం ఆశిస్తారు. తమ హీరో సినిమా తొలి రోజు తొలి ఆట తాము చూడాలనుకుంటారు. అందుకే నానా బాధలు పడి, ఎండలో నిల్చుని మరీ బాహుబలి విడుదలయిన శుక్రవారం నాడు…

సాధారణంగా హీరోల అభిమానులు ఏం ఆశిస్తారు. తమ హీరో సినిమా తొలి రోజు తొలి ఆట తాము చూడాలనుకుంటారు. అందుకే నానా బాధలు పడి, ఎండలో నిల్చుని మరీ బాహుబలి విడుదలయిన శుక్రవారం నాడు ఉదయం ఆటకు టికెట్ లు సంపాదించుకున్నారు. తీరాచూస్తే, ఇప్పుడు తూచ్, ఈ రోజే (27) విడుదల చేస్తున్నారు, రాత్రి తొమ్మిది గంటల ఆటతో అని బయటకు వచ్చింది. కొత్తగా బుకింగ్ లు ఓపెన్ అయ్యాయి. అంతకు ముందు టికెట్ లు దొరకని వారు వీటిని దక్కించుకుంటున్నారు. కానీ తొలి రోజు చూద్దామని టికెట్ కొనుక్కున్న వాళ్లు ఇప్పుడు మలి రోజు చూస్తున్నట్లయింది.

అయితే తెలంగాణ ప్రభుత్వం నిర్మొహమాటంగా స్పెషల్ షోలు ఇవ్వము అని చెప్పేయడంతో, ఖైదీ నెంబర్ 150 సినిమాకు ఆంధ్రలో ఇలాగే చేసారు, ఈ కొత్త ఎత్తుగడకు తెర తీసినట్లు తెలుస్తోంది. నిజానికి పేరుకు ఈ రోజు విడుదల అని అంటున్నారు. కానీ ఆ షో ల టికెట్ లు ఎక్కడా థియేటర్ల వద్ద దొరకడం లేదు. వాటిని నేరుగా తెలిసిన వారి ద్వారా మాత్రమే 1500 వంతున అమ్ముతున్నారు. 

మరి ఈ దందాను తెలంగాణ ప్రభుత్వం అరికడుతుందా, లేదా బాహుబలి జనాల వత్తిడి, సిఫార్సులు, మొహమాటాలకు లొంగి వదిలేస్తుందా చూడాలి మరి.