నాగ్ చైతన్య కు ముద్దుల మామయ్య వున్నాడు. ప్రేమమ్ సినిమాలో ప్రిన్సిపాల్ తో మాట్లాడడానికి అర్జెంట్ గా వచ్చాడు. మళ్లీ ఇప్పుడు అదే నాగ్ చైతన్య యుద్ధం శరణం సినిమాను సక్సెస్ బాట పట్టించడానికి, వీలయినంత బజ్ తేవడానికి వస్తున్నాడు.
ఆ ముద్దుల మామయ్య మరెవరో కాదు. విక్టరీ వెంకటేష్. నాగ్ చైతన్య అప్ కమింగ్ సినిమా యుద్దం శరణం సినిమా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో విడుదలవుతోంది.
ఈ సినిమా అడియో ఫంక్షన్ ఈనెల 27న జెఆర్సీ ఫంక్షన్ హాలులో జరగబోతోంది. ఈ సినిమాకు చైతూ ఫ్యామిలీ సభ్యులు కీలక అతిధులుగా హాజరవుతారట. మేనేమామ వెంకటేష్, కాబోయే భార్య సమంత, తమ్ముడు అఖిల్ హాజరవుతారట. మొత్తానికి చైతూ సినిమాకు బ్యాకింగ్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ కదలి వస్తున్నారన్నమాట.