తెలుగు తెరపై మళ్లీ తమన్నా కనిపించబోతోంది. బాహుబలి 2 తరువాత తమన్నా మరే తెలుగు సినిమాకు సైన్ చేసిన దాఖలా లేదు. ఇప్పుడు ఓ సినిమాకు ఓకె చెప్పింది. కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ గా నటిండానికి తమన్నా సై అనేసింది.
ఏడ్ ఫిల్మ్ మేకర్, 180 అనే తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన జయేంద్ర దర్శకుడిగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమా నిర్మించబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరో. ఈ సినిమాకే ఇప్పుడు తమన్నా హీరోయిన్ గా ఎంపికయింది.
ప్రస్తుతం బ్లూ ప్లానెట్ ప్రొడక్షన్స్ లో ఎమ్మెల్యే సినిమాచేస్తున్నాడు కళ్యాణ్ రామ్. అది అక్టోబర్ నాటికి పూర్తయిపోతుంది. అది పూర్తి కాగానే జయేంద్ర డైరక్షన్ లోని సినిమా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తమన్నాకు తెలుగులో సినిమాలు లేవు.
దాదాపు అందరు హీరోల సరసన నటించేసినటే. రిపీట్ అన్నది కాస్త కష్టమే. ఎందుకంటే, యంగ్ హీరోయిన్లు చాలా మంది వచ్చేసారు. అందువల్ల కళ్యాణ్ రామ్ సరసన చాన్స్ రావడం తమన్నాకు కాస్త కలిసి వచ్చే విషయమే. మిడిల్ రేంజ్ హీరోలు ఇప్పుడు తమన్నా గురించి ఆలోచించడానికి అవకాశం వుంటుంది.