చైతూ కొత్త సినిమా లాక్?

విక్రమ్ కే కుమార్ తో కలిసి థాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగ్ చైతన్య. పూర్తి చేసిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా వుంది. చేయాల్సిని బంగార్రాజు అలాగే వుంది.  Advertisement ఈ మధ్యలో ఇంద్రగంటి…

విక్రమ్ కే కుమార్ తో కలిసి థాంక్యూ సినిమా చేస్తున్నాడు నాగ్ చైతన్య. పూర్తి చేసిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా వుంది. చేయాల్సిని బంగార్రాజు అలాగే వుంది. 

ఈ మధ్యలో ఇంద్రగంటి డైరక్షన్ లో ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ వి సినిమా ఫలితం తరువాత ఆ సినిమా పరిస్థితి సందిగ్ధంలో పడింది. దాంతో ఇప్పుడు వేరే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

డివివి దానయ్య నిర్మాతగా కిషోర్ తిరుమల డైరక్షన్ లో ఓ సినిమాకు చైతన్య ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. రెడ్ సినిమా తరువాత శర్వానంద్ తో ఆడాళ్లూ మీకు మీ జోహార్లు చేస్తున్నాడు కిషోర్ తిరుమల. ఆ తరువాత ఈ సినిమా మీదకు వస్తాడు.. యూత్ ఫుల్ ఎమోషనల్ సినిమాలు చేయడంలో కిషోర్ తిరుమల కు పాజిటివ్ రిపోర్ట్ వుంది. 

అందుకే చైతూ ఓకె చెప్పి వుంటాడు. కథలను డైరక్టర్లను ఎంచుకోవడంలో చైతూ చాలా జాగ్రత్తగా వుంటున్నాడు ఈ మధ్య. ముఖ్యంగా కొత్తవాళ్లతో చేయడం దాదాపు ఆపేసినట్లే. హిందీలో చేస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమా వర్క్ దాదాపు పూర్తయిందని బోగట్టా.