అఖిల్ సినిమా సంగతి జనం మరిచిపోయారు కానీ, బయ్యర్లకు ఆ పీడకల ఇంకా కళ్ల ముందు నుంచి పోలేదు. నాగ్ చూద్దాం అన్నాడు..వినాయక్ పారితోషికం వదులుకున్నాడు..వైజాగ్, మరో జిల్లా బయ్యర్ బాధ్యత తీసుకున్నాడు. అయినా కూడా ఇంకా గొడవ సమసిపోలేదు. వినాయక్ వదులుకున్న పారితోషికం మూడు కోట్లు తమకు ఇవ్వాలని బయ్యర్లు కొరుతున్నట్లు వినికిడి.
అయితే వినాయక్ తనకు ఇవ్వాల్సిన దానిని వదులుకున్నారు కానీ, తమకు మూడు కోట్లు ఏమీ ఇవ్వలేదని, తాము ఎక్కడ నుంచి ఇస్తామని నితిన్ తండ్రి సుధాకర రెడ్డి అంటున్నట్లు తెలుస్తోంది. పదకొండు కోట్ల పారితోషికం అడిగి, అలాంటి సినిమా తీసి ఇచ్చినందుకు మూడు కోట్లు వదులుకున్నరని, అంతే కానీ, తీసుకున్న అడ్వాన్స్ పారితోషికం ఏడు కోట్లలో ఏమీ వెనక్కు ఇవ్వలేదని వారి ఆర్గ్యుమెంట్.
నాగ్ కావచ్చు.. నితిన్ కావచ్చు.. వినాయక్ కావచ్చు.. తమకు క్యాష్ రూపంలో కాంపన్ సేట్ చేయాలి కానీ, మాటల వల్ల కాదని, ఎప్పుడో సినిమాలు వస్తాయి.. వాటి హక్కుల విషయంలో రేటు తగ్గించడం లాంటివి తమకు వద్దని బయ్యర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. దానికి ఎవరూ అంగీకరించకపోవడం, విషయమై చాంబర్ కు ఫిర్యాదు చేయాలని బయ్యర్లు డిసైడ్ అయిపోయారని వినికిడి.