నమ్మండి.. నమ్మకపొండి… ఇది నిజం.. మహేష్ బాబు ను మరో రెండు రోజుల్లో శ్రీనువైట్ల కలవ బోతున్నాడు. శ్రీను వైట్ల ఇటీవల పదే పదే అడిగిన మీదట, మహేష్ 30న కలవమని కబురంపాడు. అంత మాత్రం చేత మహేష్ సినిమా చేసేస్తాడని కాదు. ఎంత చెడ్డా తనకు ఓ బ్లాక్ బస్టర్..ఓ డిజాస్టర్ ఇచ్చిన డైరక్టర్ అనే గౌరవంతో. ఇప్పటికిప్పుడు శ్రీను వైట్లతో సినిమా చేసే పరిస్థితిలో మహేష్ లేడు.
బ్రహ్మోత్సవం పూర్తి కావాలి. మురగదాస్ ప్రాజెక్టు సంగతి తేలాలి. దానయ్య-వినాయక్ కాంబినేషన్ లో సినిమా అనుకున్నారు అది తేలాలి. ఆ తరువాతి సంగతి. బహుశా మహేష్ ఇదే వివరించి, మంచి పాయింట్ వుంటే ఆ తరువాత చేద్దాం అనొచ్చు. నోటితో లేదనే బదులు చేత్తోలేదనాలి అన్నది సామెత. ఆ విధంగా శ్రీనువైట్లకు మహేష్ మాట ఇవ్వడం వుంటుంది. దాన్ని బట్టి, అప్పుడు శ్రీనువైట్ల నాగ్ చైతన్యా? రామ్ నా? రానా నా? విష్ణునా? అన్నది తేల్చుకుంటాడు.