ఐ సినిమా వ్యవహారం కాస్త ముదిరేలాగే కనిపిస్తోంది. సంక్రాతికి ఈసినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలు విడుదల చేయకూడదన్న చాంబర్ నిబంధన వుండనే వుంది. కానీ దీన్ని తోసి రాజని ఐ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు కాస్త ముందుగా పూరి-ఎన్టీఆర్ కాంబినేషన్ లో బండ్ల గణేష్ నిర్మిస్తున్న సినిమా విడుదల వుంది. అయితే చాంబర్ అధ్యక్షుడు, ఐ హక్కులు పొందినది ఒకరే కావడంతో ఐ కి అడ్డు లేదు.
అందుకే ఇప్పుడు బండ్ల గణేష్ ఈ విషయమై చాంబర్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిటిషన్ పెట్టి, దానిపై చర్చకు, సమావేశానికి డిమాండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.