Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చంపేస్తాడు.. బాబూ చంపేస్తాడూ..

చంపేస్తాడు.. బాబూ చంపేస్తాడూ..

ఆర్జీవీ ఖాళీగా వుండరు.. వుండలేరు. ఏదో ఒకటి చేయాలి. ఆ ఏదో ఒకటి కూడా మామూలుగా వుండకూడదు. సంచలనంగా వుండాలి. అదే టార్గెట్ గా ఇప్పుడు రూపొందిస్తున్న సినిమా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ఈ సినిమా లోగోను లాంచ్ చేసారు. లోగో, దాని నేపథ్యంలో వేసేయండ్రా నా కొడుకుని అంటూ వినవచ్చే అరుపు, ఆ సంగతి అలావుంచితే, ఈ సినిమా కూడా నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేయబోతోందని తెలుస్తోంది.

సినిమా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంతో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఇలా ప్రమాణ స్వీకారం కావడం, కడప ప్రాంతాలకు చెందిన సుమోలు, స్కార్పియోలు పెద్ద సంఖ్యలో విజయవాడలోకి దూసుకురావడం, లోకల్ జనాలు (ఆర్జీవీ లెక్కలో కమ్మ సామాజిక వర్గం) తలుపులు వెనుక దాక్కుని బిక్కు బిక్కుమంటూ చూడడం, ఇలా ముందుకు సాగుతుంది సినిమా అన్నది విశ్వసనీయ వర్గాల బోగట్టా.

అయితే ఇక్కడ ఓ కీలకమైన పాయింట్ వుందని తెలుస్తోంది. 2014లో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆయన అనునాయులు విశాఖలో ఓ ట్రిక్ ప్లే చేసారు. అది స్థానికులకు అంతా అయిపోయాక తెలిసింది. కడప ప్రాంతానికే చెందిన తెలుగుదేశం మనుషులనే విశాఖ తీసుకువచ్చి, అక్కడక్కడ వుంచి, 'ఇదిగో విశాఖను కడపగా మార్చేస్తున్నారు. కడప జనాలు వచ్చేసారు' అంటూ వైకాపా అభ్యర్థి విజయమ్మ మీద విపరీతంగా ప్రచారం చేసారు. దాంతో విశాఖ జనాలు ఈ ప్రచారం నమ్మి, విజయమ్మను దూరంపెట్టారు. ఓడించారు.

ఇదే పాయింట్ ను తీసుకుని వర్మ 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. రెడ్లు రాకుండానే వచ్చినట్లు, జనాల్ని కొట్టినట్లు, చంపినట్లు ప్లాన్ చేసి వైకాపాను అన్ పాపులర్ చేసే స్కీమ్ చంద్రబాబు చేస్తారు అన్నదే టాపిక్ అని తెలుస్తోంది. అందులో భాగంగా అవసరం అయితే తమ పార్టీ జనాలు కొందరిపై తనే కుట్రపన్ని దాడులు చేయిస్తారు అన్నది సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 'చంపేస్తాడూ.. బాబు చంపేస్తాడూ..అంటే సాంగ్ ఒకటి వుంటుందని తెలుస్తోంది. ఈ పాటను త్వరలో విడుదల చేసే అవకాశం వుంది. అలాగే టీజర్ కూడా వస్తుందని తెలుస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కు బ్రేక్ లు పడ్డాయి కానీ, ఈ సినిమాకు ఈసారి బ్రేక్ లు పడే అవకాశం తక్కువ. అందుకే త్వరగా ఫినిష్ చేసి, విడుదల చేసే ఆలోచనలో వున్నారు వర్మ. ఈ మేరకు కొంతమంది భాగస్వాములు ఆయనకు జతకలిసినట్లు తెలుస్తోంది.

ఈ హీరో ఆఫీస్ చూసారా? అదుర్స్ కదా..?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?