Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చాంద్ ఖాన్ దగ్గర శ్రీరెడ్డి స్క్రీన్ షాట్ లు?

చాంద్ ఖాన్ దగ్గర శ్రీరెడ్డి స్క్రీన్ షాట్ లు?

కొన్ని విషయాల భలే గమ్మత్తుగా వుంటాయి. ఎవరో ఏదో చేస్తే, అది తమ ఘనత అన్నట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. ఓ ఛానెల్ అలాంటి వ్యవహారమే చేసి సైలెంట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే, ఓ ఛానెల్ వున్నట్లుండి, టాలీవుడ్ లో అమ్మాయిల ఎక్స్ ప్లాయిటేషన్ మీద తాము స్టింగ్ ఆపరేషన్ చేసామని 'గంభీరంగా' ప్రకటించింది. మేము స్టింగ్ ఆఫరేషన్ చేసాం.. మేమూ.. స్టింగ్ ఆపరేషన్ చేసాం.. స్టింగ్ ఆపరేషన్ మేము చేసాం. అంటూ వాక్యానికి రెండు సార్లు వంతున వల్లె వేస్తూ, చెప్పిన విషయాలు మూడు నాలుగు. ఒకటి ఓ పెద్ద నిర్మాత కొడుకు వైనం. రెండవది ఒక పెద్ద డైరక్టర్ చాటింగ్ స్క్రీన్ షాట్లు. మరోకటి ఓ కాస్టింగ్ మేనేజర్ తో చాటింగ్ షాట్లు.

ఇలా ఇవన్నీ తమ ఘనతే, తమ స్ట్రింగ్ ఆపరేషన్ నే అన్నట్లు చెప్పుకుంటూ వచ్చింది. కానీ తరువాత సీన్ మారింది. శ్రీరెడ్డి తెరపైకి వచ్చింది. అన్ని చానెళ్లలో ఆ కాస్టింగ్ మేనేజర్, ఆ డైరక్టర్, ఆ నిర్మాత కథనాలు బయటకు వచ్చేసాయి. ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, స్టింగ్ ఆపరేషన్ కాదు..,ఇదంతా ఆ అమ్మాయి శ్రీరెడ్డి చేసిన లీక్ లు అని తేలింది.

శ్రీరెడ్డి తన బాధలు అన్నీ చెప్పుకోవడానికి, తన దగ్గరున్న మెటీరియల్ అంతా ఇస్తే, దాన్ని స్ట్రింగ్ ఆపరేషన్ తాము చేసాం అని చెప్పుకోవడం ఏమిటో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఆ చానెల్ ఈ మధ్య యాక్టివ్ అయింది. ఈ స్క్రీన్ షాట్ లు, ఇతరత్రా వ్యవహారాలు ఇప్పటివి కావు.

అందుకేనా గప్ చుప్

ఈ 'స్ట్రింగ్' ఆరంభంలో బాలీవుడ్ కాస్టింగ్ మేనేజర్ చాంద్ గురించిన కొన్నివాట్సప్ స్క్రీన్ షాట్ లు చూపించారు. ఆ తరువాత విషయం అంతా చాలా మలుపులు తిరిగి ఎక్కడో ఎండ్ అయింది. ఎలాగో ఎండ్ అయింది. కానీ ఈ మేనేజర్ సంగతి అక్కడే వదిలేసారు. దీనికి కారణం వేరే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు ఆ మేనేజర్ ను శ్రీరెడ్డి తానే కదిపిందని, తన గురించి కొన్ని అవాస్తవ వివరాలు ఇచ్చిందని తెలుస్తోంది. ఈమేరకు చాంద్ దగ్గర దాదాపు యాభై వరకు స్క్రీన్ షాట్ లు వున్నాయని వినికిడి. ఈ స్ట్రీన్ షాట్ లు కొన్ని గ్రేట్ ఆంధ్రకు లభించాయి. వీటిలో శ్రీరెడ్డి తనది దుబాయ్ అని, తనది విఐపి ఫ్యామిలీ అని, తనకు గండి పేటలో ఫార్మ్ హవుస్ వుందని, ఒకే ఒక్క సినిమాలో అయినా నటించాలన్నది తన కోరిక అని, ఆ తరువాత వెనక్కు వెళ్లిపోతానని పేర్కొన్నట్లు కనిపిస్తోంది.

అయితే చాంద్ తో శ్రీరెడ్డి తన పేరుతో కాకుండా, లిఖిత రెడ్డి అనే పేరుతో చాట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వాట్సప్ స్క్రీన్ షాట్ లలో పేర్లు వుంటాయి కానీ నెంబర్లు వుండవు. అందువల్ల ఫేక్ షాట్ లు కూడా చేయవచ్చు. అయితే ఫోన్లు అందిస్తే, ఆ పేరు, దానికి వున్న నెంబర్ చూసి అది ఫేక్ కాదా అన్నది డిసైడ్ చేయవచ్చు. కానీ చాంద్ మాత్రం తనతో శ్రీ రెడ్డి లిఖిత రెడ్డి అనే పేరుతో చాట్ చేసినట్లు చెబుతున్నట్లు తెలుస్తోంది.

అవసరం అయితే ఈ స్క్రీన్ షాట్ లు అన్నీ బయట పెడతా అని చాంద్ అంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఇప్పుడు శ్రీరెడ్డి తన పొరాటాన్ని వేరే విధంగా మలుచుకుంటూ, తన గోల్ సాధించే యత్నంలో వున్నట్లు తెలుస్తోంది. చానెళ్లు, సోషల్ మీడియా హడావుడి తగ్గించినట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?