కథ లేదు కానీ 12న క్లాప్?

బాలయ్య-వివి వినాయక్ సినిమాకు కథ అయితే ఇంకా లేదు. అయితే సినిమా కోసం ఆఫీస్ తీసారు. కథ వంటకం ప్రారంభించారు. ఈలోగా బాలయ్య చేత ఓకె అనిపించేసుకుని, క్లాప్ కొట్టించేయాలని నిర్మాత సి కళ్యాణ్…

బాలయ్య-వివి వినాయక్ సినిమాకు కథ అయితే ఇంకా లేదు. అయితే సినిమా కోసం ఆఫీస్ తీసారు. కథ వంటకం ప్రారంభించారు. ఈలోగా బాలయ్య చేత ఓకె అనిపించేసుకుని, క్లాప్ కొట్టించేయాలని నిర్మాత సి కళ్యాణ్ సరదా పడుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చేయాల్సి వుంది. ఆ సినిమా షూట్ పూర్తవుతునే మరో సినిమా స్టార్ చేసే ఆలోచనలో వున్నారు.

ఆ ప్రాజెక్టు కోసం సి కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. వివి వినాయక్ మంచి కథ తెస్తే తాను రెడీ అని బాలయ్య చిన్నగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బోగట్టా. అందుకే మే 12న లాంఛనంగా క్లాప్ కొట్టించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క మరో దర్శకుడు సంపత్ నంది కూడా బాలయ్యను కథతో మెప్పించేందుకు ట్రయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ బాలయ్య మాత్రం సంపత్ నందితో చేసేందుకు ఎందుకో ఇష్టపడడం లేదని వినికిడి.

జై సింహా 100డేస్

చాలా కాలం తరువాత బాలయ్యతో సినిమా లాభం సంపాదించిన నిర్మాత ఎవరు అంటే సి కళ్యాణ్ నే. జై సింహా చిలకలూరిపేటలో నేరుగా వంద రోజులు ఆడిదంట. అందుకే ఆ ఊరిలోనే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ చేయాలని ఆలోచిస్తున్నారు. బాలయ్య ఫంక్షన్, అందులోనూ చిలకలూరి పేటలో అంటే ఇక ఫ్యాన్స్ సందడే సందడి.